- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: బస్సు ప్రమాదం.. 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా హకీంపేట్(Hakimpet) ఏరియాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా హకీంపేట్(Hakimpet) ఏరియాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి రాజీవ్ రహదారిపై మార్గం మధ్యలో బస్సు స్టీరింగ్ విరిగిపోయినట్లు సమాచారం. డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. నడిరోడ్డుమీదే బస్సు ఆగిపోవడంతో రహదారిపై ఫుల్లుగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నిమిషాల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






