అట్టహాసంగా ప్రగతి చక్రం వార్షిక పురస్కారాలు

by Seetharam |

రోడ్డు ర‌వాణా సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ పేర్కొన్నారు.

అట్టహాసంగా ప్రగతి చక్రం వార్షిక పురస్కారాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రోడ్డు ర‌వాణా సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్​లో ఆయన ఉత్తమ ఉద్యోగులను అభినందించారు.ఈ సందర్భంగా సజ్జనార్​ మాట్లాడుతూ..విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న శ్రామిక్​, హెల్ఫర్లు, డ్రైవర్​,కండాక్టర్లు, సూపర్​వైజర్లను ప్రోత్సహించేందుకే సంస్థ సన్మానంతో పాటు అవార్డులు ఇచ్చిందన్నారు. వివిధ‌ కేట‌గిరీల్లో సుమారు 500 మందికి పైగా అవార్డుల‌ను అందించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల కృషిని అభినందించేందుకు న‌గ‌దు పుర‌స్కారాల‌తో పాటు అవార్డులు బ‌హూక‌రించామన్నారు. డిపో స్ధాయిలో నెల‌వారీగా, ప్రాంతీయ స్థాయిలో త్రైమాసికం, జోనల్ స్థాయిలో ఆరు నెల‌ల‌కొక‌సారి, కార్పొరేట్ స్ధాయిలో ఏడాదికొక‌సారి నిర్వహిస్తామన్నారు. ఉత్తమ ప‌నితీరును క‌న‌బ‌రిచిన ఉద్యోగులు, అధికారుల‌కు రోల్ ఆఫ్‌ హాన‌ర్ కింద 24 మంది పుర‌స్కారాలు అందుకున్నట్లు వెల్లడించారు. అతి త్వరలో రూ.37 కోట్లతో నిర్మల్ బస్​ స్టేషన్​, రూ. 80 కోట్లతో వరంగల్ బస్​స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చీఫ్​ ఆపరేటింగ్ ఆఫీసర్ ​డాక్టర్​ రవీందర్​, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్​ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story