- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TGSRTC : ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన RTC
ప్రయాణికులకు భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ సంస్థ(TGSRTC).

దిశ, వెబ్ డెస్క్ : ప్రయాణికులకు భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ సంస్థ(TGSRTC).హైదరాబాద్-విజయవాడ(Hyderabad-Vijayawada) రూట్‌లో బస్సు టికెట్లపై భారీ తగ్గింపు(Ticket Discounts) ప్రకటించింది. ఈ రూట్‌లో వివిధ బస్సుల్లో టికెట్ ధరలపై 16% నుంచి 30% వరకు భారీ రాయితీని ప్రకటించింది. గరుడ ప్లస్ బస్సుల్లో టికెట్లపై 30 శాతం తగ్గించగా... ఈ - గరుడ బస్సుల్లో 26 శాతం తగ్గించింది. సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్సుల్లో 20 శాతం... రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో టికెట్లపై 16 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రాయితీలు అడ్వాన్స్ రిజర్వేషన్‌తో బస్సు టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే వర్తించనున్నాయి.
ఈ రూట్‌లో రద్దీ ఎక్కువగా ఉండటం, ప్రైవేట్ బస్సుల ధరలు అధికంగా ఉండటం వల్ల ప్రయాణికుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. TGSRTC హైదరాబాద్-విజయవాడ రూట్‌లో 10 ఎలక్ట్రిక్ బస్సులను ఇప్పటికే నడుపుతుండగా... మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను డిసెంబర్ 2025 నాటికి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.






