ప్రైవేట్ బస్సులపై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు.. మరో 9 బస్సులపై కేసు నమోదు

by Malleboina Mahesh |   (  Updated:2025-10-27 03:19:35  IST  )

కర్నూలు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ప్రైవేట్ బస్సులపై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు.. మరో 9 బస్సులపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖ (ఆర్టీఏ) అధికారులు అప్రమత్తమయ్యారు. గత మూడు రోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులను గుర్తించేందుకు అధికారులు ఈ ఆపరేషన్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతంలో సోమవారం ఆర్టీఏ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు.

అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 9 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా, స్లీపర్ కోచ్‌గా అనుమతి లేకుండా నడుస్తున్న కేవీఆర్ ట్రావెల్స్‌ బస్సును సీజ్ చేశారు. అధికారులు వాహన పత్రాలు, బీమా, టెక్నికల్ కండిషన్‌లను పరిశీలించారు. కర్నూల్ ప్రమాదం తర్వాత ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్టీఏ అధికారులు ఈ దాడులు కొనసాగిస్తామని వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రయాణికులు లైసెన్స్‌డ్‌ బస్సుల ద్వారానే ప్రయాణించాలని సూచించారు.

Next Story