- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం.. 40 స్కూల్ బస్సులు సీజ్!
తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభమైన నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వించింది.

X
దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పాఠశాలలు, విద్యాసంస్థలు జూన్ 15 నుండి పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల భద్రతే ధ్యేయంగా రవాణా శాఖ రంగంలోకి దిగింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్డెక్కుతున్న స్కూల్ బస్సులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు (స్పెషల్ డ్రైవ్) నిర్వహిస్తోంది. ఈ తనిఖీల్లో భాగంగా జూన్ 16న రాష్ట్రవ్యాప్తంగా 1200కు పైగా పాఠశాల వాహనాలను రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు. వీటిల్లో నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న 165 వాహనాలపై కేసులు నమోదు చేశారు. వీటిలో ఫిట్‌నెస్ లేని 40 స్కూల్ బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ఈ తనిఖీలు కొనసాగుతాయని రవాణా శాఖ తెలిపింది.
Next Story






