కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ సందేశాలు

by velandi.Saikiran |

వాట్సాప్ ద్వారా ఫేక్ మెసేజ్‌లు పంపుతూ అధికారులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవురావు తెలిపారు.

కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ సందేశాలు
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : తన పేరుతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ ద్వారా ఫేక్ మెసేజ్‌లు పంపుతూ అధికారులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవురావు తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఇటువంటి నకిలీ సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ అధికారిక సమాచార వ్యవహారాలు కేవలం అధికారిక మార్గాల ద్వారానే జరుగుతాయని వివ‌రించారు. తెలియని నంబర్ల నుంచి, జిల్లా కలెక్టర్ పేరు, ఫోటో, ఇతర వివరాలు ఉపయోగించి వచ్చే సందేశాలను నమ్మకుండా వెంటనే తమ దృష్టికి, స్థానిక పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు.

Next Story