- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూలే విగ్రహంపై దాడి.. ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదు
ఇటీవల తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహంపై జరిగిన దాడి ఘటన అత్యంత బాధాకరమని, ఈ ఘటనకు ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రచార్ప్రముఖ్రాజగోపాల్తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహంపై జరిగిన దాడి ఘటన అత్యంత బాధాకరమని, ఈ ఘటనకు ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రచార్ప్రముఖ్రాజగోపాల్తెలిపారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంతో, ఎంతో ఉత్సాహంగా జనవరి 25న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం, ఫిబ్రవరి 6న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నారు. గ్రామంలోని వారు అందరూ కలిసి ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఈ మధ్యలో కొద్దిమంది అవకాశ వాదులు అయిన వ్యక్తులు వచ్చి పూలే విగ్రహాన్ని దెబ్బతీయడం ద్వారా గ్రామ ప్రజల్లో సామరస్య వాతావరణం దెబ్బ తీసి ఉద్రిక్త వాతావరణం నెలకొందన్నారు. ఈ సంఘటనను ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆపాదించి కావాలనే అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం జరుగుతోందని, ఇది పూర్తిగా అబద్ధం అన్నారు. రాజ్యాంగ నిర్మాతలు, దేశభక్తులు, సామాజిక సంస్కర్తల పట్ల ఆర్‌ఎస్‌ఎస్ ఎల్లప్పుడూ అత్యంత గౌరవ భావాన్ని కలిగి ఉంటుంది. సమాజంలో సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసే ఇలాంటి వ్యక్తుల పట్ల గ్రామ ప్రజలు, యువత చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు.






