- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana BJP: మహారాష్ట్ర, ఢిల్లీ ఫార్ములా తెలంగాణలో.. రాష్ట్రంలో అధికారమే టార్గెట్ గా బీజేపీ మాస్టర్ ప్లాన్
రాష్ట్రంలో అధికారమే టార్గెట్ గా బీజేపీ మాస్టర్ ప్లాన్ చేస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పార్టీల ప్రణాళికలు, కార్యాచరణ అంతా అందుకు అనుగుణంగా డిసైడ్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం కైవసం చేసుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ (BJP) ఆ దిశగా త్వరలోనే పూర్తి స్థాయిలో యాక్షన్ మోడ్ లోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఓ అవకాశంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న క్రమంలో ఆర్ఎస్ఎస్ (RSS) నుంచి వచ్చిన ఓ ప్రకటన స్టేట్ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ మారింది.
మహారాష్ట్ర, ఢిల్లీ ఫార్ములా తెలంగాణలో!
ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా జోష్ మీదున్న బీఆర్ఎస్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పవర్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందుకోసం మహారాష్ట్ర, ఢిల్లీలో ఆ పార్టీ గెలుపుకు కారణం అయిన ఫార్ములాను తెలంగాణలోనూ ఇంప్లిమెంట్ చేయబోతున్నారనే టాక్ ఇప్పుడు జోరందుకుంది. తాజాగా ఆర్ఎస్ఎస్ తెలంగాణ కార్యదర్శి కాచం రమేశ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. సంఘ్ ఆలోచనలు, భావాలను వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి తెలంగాణలోని గ్రామగ్రామానికి తీసుుకవెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని వివరించారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయితే గత మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ఆర్ఎస్ఎస్ కీలక భూమిక పోషించిందని తెలంగాణలోనూ ఆర్ఎస్ఎస్ తన కార్యకలాపాలను విస్తరించడం అంటే అది బీజేపీ బూస్ట్ ఇచ్చే అంశమే అవుతుందనే చర్చ జరుగుతోంది. ఈసారి తెలంగాణలో అధికారంలోకి రావడమే గురిగా పెట్టుకున్న కమలం పార్టీ నేతలు పక్కా వ్యూహంలో భాగంగానే ఆర్ఎస్ఎస్ చేత క్షేత్రస్థాయిలో పకడ్బందీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎదుర్కొనేనా?:
తెలంగాణలో ఆర్ఎస్ఎస్ జోరుతో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ (Congress) పై చర్చ జరుగుతోంది. ఈ రెండు పార్టీల పని కతం అయిపోయిందని రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని బీజేపీ నేతలు ఇప్పటికే పదే పదే చెబుతున్నారు. ఇటువంటి తరుణంగా ఆర్ఎస్ఎస్ ను ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఏ మేరకు సిద్ధంగా ఉన్నాయనేది ఆలోచించాల్సిన విషయం. తెలంగాణలో ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో ఇప్పటికే పని మొదలు పెట్టేసిందని తెలంగాణ గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ బెల్లయ్య నాయక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను అడ్డుకునేందు తెలంగాణలో ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగిందని, ఆ సంస్థ చాప కింద నీరులా పాకుకుపోతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన దేశనాయకత్వం అంతా ఇప్పుడు తెలంగాణపైనే దృష్టి సారించి పని చేస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయంలో ఎలాంటి పరిమామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.






