R.S. Praveen Kumar : తెలంగాణ రైజింగ్ పై ఆర్ఎస్పీ వ్యంగ్యాస్త్రాలు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-22 05:55:20  IST  )

రాష్ట్ర ప్రభుత్వం(State Government )రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్’ '(Telangana Rising')నినాదం, లోగోపై బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్(R.S. Praveen Kumar )ఎక్స్ వేదికగా వ్యంగ్య విమర్శలు(Satirical Criticism)గుప్పించారు.

R.S. Praveen Kumar : తెలంగాణ రైజింగ్ పై ఆర్ఎస్పీ వ్యంగ్యాస్త్రాలు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం(State Government )రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్’ '(Telangana Rising')నినాదం, లోగోపై బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్(R.S. Praveen Kumar)ఎక్స్ వేదికగా వ్యంగ్య విమర్శలు(Satirical Criticism)గుప్పించారు. కాంగ్రెస్ మూడు రంగుల కలర్, మీకు బాగా ఇష్టమైన 10% (కమీషన్) ను ఎవరికీ అర్థం కాకుండా మీ లోగోలో భలే ఇరికించారని.. దాన్ని మార్చకండి కాంగీస్. మిమ్ములను పొరపాటున స్వాతంత్ర సమరయోధులని ప్రజలు అమాయకంగా నమ్మే ప్రమాదం ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు తెలంగాణ ఎట్ల రైజ్ అయితున్నదో, ఆ గుండె చప్పుడు కొంచెం వినండంటూ.. రైతు భరోసా, రుణ మాఫీ మోసానికి వ్యతిరేకంగా రైతులందరూ రైజింగ్ అని..రైతు కూలీల ఆత్మీయ భరోసా మోసానికి వ్యతిరేకంగా కూలీ తల్లుల రైజింగ్ అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.

గృహలక్ష్మి, రేషన్ కార్డులు, పెన్షన్ల మోసానికి వ్యతిరేకంగా పేద ప్రజల రైజింగ్ అని, జీతాలు నాలుగు నెలలుగా రానందుకు కొత్త ఇంజనీర్ల రైజింగ్ అని, ఫైనాన్స్ లో బిల్లుల చెల్లింపు లో కమీషన్ల కక్కుర్తికి వ్యతిరేకంగా కాంట్రాక్టర్ల రైజింగ్ అని, పంచాయితీ రాజ్ లో చేసిన పనికి బిల్లులు ఇంకా రాలేదని సర్పంచుల రైజింగ్ అని విమర్శించారు. గురుకులాల్లో విషాహార ఘటనలకు వ్యతిరేకంగా విద్యార్థుల రైజింగ్ అని, లగచర్ల, వెల్మల భూములు మీ ఎనుముల-పొంగులేటిలు కబ్జాలు చేస్తున్నందుకు నిరసనగా గిరిజనుల రైజింగ్ అని,

జాబ్ కాలెండర్ రానందుకు నిరసనగా నిరుద్యోగుల రైజింగ్ అని, పేస్కేల్ ఇవ్వనందుకు నిరసనగా సమగ్ర శిక్ష ఆశ్రమ పాఠశాల అంగన్వాడీ ఉపాధ్యాయుల రైజింగ్ అని వ్యంగ్యోక్తులు విసిరారు. మూసీ - హైడ్రా అక్రమ కూల్చివేతలకు నిరసనగా దిగువ మధ్యతరగతి ప్రజల రైజింగ్ అని, ప్రతి చదరపు ఫీటుకు (sft) యాభై రూపాయల ఆర్-ఆర్ టాక్స్ కడితేనే ఫైళ్లు క్లియర్ చేస్తామన్న మీ అప్రకటిత హుకుంకు వ్యతిరేకంగా రియల్టర్ల రైజింగ్ అని, చీటికి మాటికి గృహనిర్బంధాలు, అక్రమ ప్రతీకార కేసులకు నిరసనగా ప్రతిపక్షాల రైజింగ్ అని, సైబర్ క్రైం పోలీసులను ఉద్యమకారుల అణచివేతకు వాడుతున్నారని సోషల్ మీడియా రైజింగ్ అని,

రాజ్యాంగం ఇచ్చిన మానవ హక్కుల కాలరాతకు నిరసనగా పౌరహక్కుల సంఘాల రైజింగ్ అని విమర్శించారు. ఏక్ పోలీస్ ఏమైందని స్పెషల్ పోలీసుల రైజింగ్ అని, ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పటికీ పూర్తిగా రాలేదని ఆసుపత్రుల రైజింగ్..కామారెడ్డి డిక్లరేషన్ జాడలేదని బీసీల రైజింగ్..ఖర్గే స్వయానా చేసిన చేవెళ్ల డిక్లరేషన్ చెదలు పట్టిందని దళితుల రైజింగ్..నేటికి ఆరుగురుకి మంత్రి పదవులు ఇవ్వకపోవడంతో మీ సొంత ఎమ్మెల్యేల రైజింగ్ అని, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని శిథిలం చేసే కుట్రలకు వ్యతిరేకంగా మేధావులు, ప్రజాసంఘాల రైజింగ్ అని ఆర్ఎస్పీ విమర్శించారు.

మా అసలైన తెలంగాణ తల్లిని అవమానించారని తెలంగాణ ఉద్యమకారుల రైజింగ్ అని, జైలులో ఉండాల్సిన ముఖ్యమంత్రి దావోస్-సింగపూర్ లలో ఎట్ల షికార్లు కొడుతున్నారు అని జైలు శాఖ రైజింగ్ అని మండిపడ్డారు. అవును తెలంగాణ ముమ్మాటికీ రైజింగే అని.. నేడు తెలంగాణ కక్కుర్తి-కమీషన్ల-కాలయమ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గరం గరంగా రైజ్ అవుతోందని ఆర్ఎస్పీ వ్యాఖ్యానించారు.

Next Story