- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ ఫ్యూచర్ సిటీకి రూ.300 కోట్లు.. మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ బడ్జెట్‌లో పురపాలక శాఖకు రూ.17,907 కోట్లు కేటాయింటారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైలు రెండో దశ, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణకు సర్కారు పెద్దపీట వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు పెద్దపీట వేసింది. గతేడాది బడ్జెట్‌లో కేటాయించిన రూ.17,677 కోట్లకు అదనంగా రూ.230 కోట్లు కేటాయించింది. ఈ సారి కేటాయించిన రూ.17,907 కోట్లలో ఎస్టాబ్లిష్‌మెంట్‌కు రూ.7,458 కోట్లు, పథకాలకు రూ.10,450 కోట్లు వెచ్చించనుంది. భారత్ ఫ్యూచర్ సిటీకి రూ.300 కోట్లు కేటాయించడం విశేషం. మూసీ పునరుజ్జీవనం, మెట్రోరైలు రెండో దశ ప్రాజెక్టులకు సైతం నిధులు కేటాయించారు.
మున్సిపాలిటీలకు రూ.5 వేల కోట్లు
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లకుపైగా కేటాయించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లు అయిన మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెంలకు రూ.1000 కోట్లు.. అలాగే వరంగల్ నగరానికి రూ.40 కోట్లు, ఖమ్మం నగరానికి రూ.15 కోట్లు ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. మిగిలిన కార్పొరేషన్లకు మరో రూ.50 కోట్లు వెచ్చించనున్నారు. లక్ష జనాభా కన్నా తక్కువగా ఉన్న మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం రూ.1483 కోట్లు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా మ్యాచింగ్ గ్రాంట్స్ రూ.1483 కోట్లు ఇవ్వనున్నారు. పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ మార్కెట్లను పూర్తిచేయడానికి రూ.100 కోట్లు కేటాయించారు. మున్సిపల్ వ్యర్థాల నిర్వహణకు రూ.150 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ స్కీమ్‌లో భాగంగా ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటి నిర్వహణకు రూ.100 కోట్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణకు రూ.30 కోట్లు, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు, శ్మశానవాటికలను అభివృద్ధి చేయడానికి రూ.10 కోట్లు వెచ్చించనున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ స్కీమ్‌లో స్కిల్ డెవలప్‌మెంట్, కెపాసిటీ బిల్డింగ్ కోసం రూ.54 కోట్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ, ఇతర కార్యక్రమాల కోసం నిధులు కేటాయించారు. ఫ్యూచర్ సిటీకి రూ.300 కోట్లు ఇవ్వనున్నారు.






