- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా హెరాయిన్, గంజాయి, ఓపీఎం డ్రగ్స్ సీజ్ : సీపీ అవినాశ్ మహంతి
శంషాబాద్ (Shamshabad) పరిధిలో గల రాయికల్ టోల్ గేట్ (Raikal Toll Gate) వద్ద భారీగా హెరాయిన్ (Heroin), డ్రగ్స్ పట్టుకున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి (CP Avinash Mahanti)తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ (Shamshabad) పరిధిలో గల రాయికల్ టోల్ గేట్ (Raikal Toll Gate) వద్ద భారీగా హెరాయిన్ (Heroin), డ్రగ్స్ పట్టుకున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి (CP Avinash Mahanti)తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. షాద్ నగర్లోని రాయికల్ టోల్ గేట్ వద్ద భారీగా హెరాయిన్ డ్రగ్స్ పట్టుబడ్డాయని పేర్కొన్నారు. సంజుభాయ్ మార్వాడి దాబాలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో నిఘా పెట్టామని, అక్కడ పనిచేసే వంటమనిషి వికాస్ సాహు రాజస్థాన్ నుంచి డ్రగ్స్ ఇక్కడికి తీసుకొచ్చి కస్టమర్స్‌కు విక్రయిస్తున్నాడని చెప్పారు. వికాస్ సాహుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగా.. రూ.3 కోట్ల విలువైన హెరాయిన్, గంజాయి, ఓపీఎం డ్రగ్స్ లభించాయని, వాటిని సీజ్ చేశామని తెలిపారు. వికాస్‌ను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వికాస్ వద్ద ఎవరెవరు రెగ్యులర్‌గా డ్రగ్స్ కొంటున్నారో తెలుసుకునే పనిలో ఉన్నామని, త్వరలోనే ఈ రాకెట్‌ను చేధిస్తామన్నారు.






