- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth reddy: ఐపీఎస్ అధికారులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
ఐపీఎస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. విధి నిర్వహణలో మరణించినా, లేదా ఏదైనా జరిగినా వారి కుటుంబాలకు

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. విధి నిర్వహణలో మరణించినా, లేదా ఏదైనా జరిగినా వారి కుటుంబాలకు రూ.2 కోట్ల ఆర్థికసాయం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. అడిషనల్ ఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులకు రూ.1.5 కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పోలీసు అధికారులకు అనుకోని సంఘటనలు జరిగితే శాశ్వతంగా వారి కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని చెప్పారు.
ప్రజాసేవలో మునిగి ఉన్న పోలీస్ శాఖ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ద్వారా ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. పోలీస్ శాఖలోని హోం గార్డు నుండి ఉన్నతాధికారుల వరకు వారి పిల్లల కోసం యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నిర్మించినట్టు తెలిపారు. 50 ఎకరాలను పోలీస్ స్కూల్ కోసమే కేటాయించామని అన్నారు. సీవీ ఆనంద్‌తో పాటూ ఉన్నతాధికారులు ఆ స్కూల్‌ను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. పోలీస్ స్కూల్ లో చదువుకున్న విద్యార్థులు గర్వంగా చెప్పుకునేలా ఆ స్కూల్ తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పోలీస్ శాఖకు పూర్తి సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.






