- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.1,686.39 కోట్లు
నగరంలోని ప్రభుత్వ ఆస్తుల ఆస్తిపన్ను బకాయిల క్లియరెన్స్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.1,686.39 కోట్లు మంజూరు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగర పరిధిలో ప్రభుత్వ ఆస్తులపై పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 2,217 ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన అసలు పన్ను, వడ్డీ కలిపి సుమారు రూ.5,864 కోట్ల బకాయిలు ఉండగా, ప్రభుత్వం 'వన్ టైమ్ సెటిల్మెంట్' (OTS) విధానంలో వడ్డీ, పెనాల్టీలపై 100 శాతం మాఫీ ప్రకటించింది. దీంతో అసలు పన్ను అయిన రూ. 1,686.39 కోట్లను మాత్రమే చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు చెల్లించడానికి పరిపాలనా మంజూరు ఇస్తూ మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నీలోఫర్ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రి, ప్రజాభవన్, సచివాలయం తదితర ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలు సైతం క్లియర్ అయినట్టు అధికారులు చెబుతున్నారు.
ఏడాదిలో రూ.1,686.39 కోట్ల చెల్లింపు
జీహెచ్ఎంసీ (GHMC), సీఎంసీ (CMC), ఎంఎంసీ (MMC) పరిధిలోని ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి, 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.5,864.92 కోట్ల బకాయిలకు గాను వడ్డీ, పెనాల్టీల మాఫీ తర్వాత మూడు కార్పొరేషన్లకు రూ.1,686.39 కోట్లను ఆర్థిక శాఖ ద్వారా ప్రభుత్వం ఏడాదిలోపు సర్దుబాటు చేయనుంది.
మాఫీ తర్వాత మూడు కార్పొరేషన్లకు రూ. 1,686.39 కోట్లను ఆర్థిక శాఖ ద్వారా ప్రభుత్వం ఏడాదిలోపు సర్దుబాటు చేయనుంది.






