కుక్కకు రూ.1500 ఖర్చు.. ఏబీసీ పేరుతో రూ.కోట్లు గండి

by Ajay Maddhiboyina |

గ్రేటర్‌లో కుక్కల మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి. ఏబీసీ పేరుతో కొన్ని సం స్థలు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నా యి. అందుకు జీహెచ్ఎంసీ వెటర్నరీ విభా గం అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

కుక్కకు రూ.1500 ఖర్చు.. ఏబీసీ పేరుతో రూ.కోట్లు గండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్‌లో కుక్కల మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి. ఏబీసీ పేరుతో కొన్ని సం స్థలు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నా యి. అందుకు జీహెచ్ఎంసీ వెటర్నరీ విభా గం అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి కుక్కల నియంత్రణలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి అంబ ర్‌పేట్, హయత్ నగర్ ఘటనలే నిదర్శనం. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, ఏబీసీ, ఏఆర్వీ కోసం ఒక్కో కుక్కకు రూ.1500 ఖర్చు చే స్తున్నారు. కానీ ఎక్కడా పూర్తి స్థాయిలో ఏ బీసీ కార్యక్రమాలు జరగడం లేదనడానికి కుక్కల సంఖ్య పెరగడమే.

అధికారుల హడావుడి

గ్రేటర్ పరిధిలో రోజుకు రెండు, మూడు చోట్ల చిన్నారులపై కుక్క కాటు కేసులు న మోదవుతున్నాయి. అయినా జీహెచ్ఎంసీ అయినా అధికారులు పట్టించుకోవడంలే దు. అంబర్‌పేట్‌లో నాలుగేళ్ల బాలుడిని వీ ధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చగా ఆ బాలుడు మరణించాడు. హయత్ నగర్‌లో ప్రేమ్‌చంద్ అనే బాలుడిపై కుక్క ల దాడి సంచలనం రేపింది. శరీరమంతా గాయాలు, చెవిని పూర్తిగా కొరికేశాయి. ఇ లాంటి ఘటనలు రోజూ జరుగుతున్నా జీ హెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదు. అంబర్‌పేట్, హయత్ నగర్ లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేయడం అలవాటుగా మారిందని పలువురు ప్రజా సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రూ.40 కోట్లపైనే..

జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 4 లక్ష ల వీధి కుక్కలున్నాయి. వీటిలో 77 శాతం కుక్కలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కుక్కల నియంత్రణకు ‘కంట్రోల్ ఆఫ్ స్ట్రే యానిమ ల్స్’ హెడ్ పేరుతో ప్రతి ఏడాది నిధులు కే టాయిస్తున్నారు. స్టెరిలైజేషన్స్, వ్యాక్సినేష న్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఇతర జంతువుల సంక్షేమ కా ర్యక్రమాల నిర్వహణకు ఐదేండ్లలో రూ.40 కోట్లపైనే ఖర్చు చేశారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ), యాంటీ రేబిస్ (ఏఆర్) కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయినా 70 శాతం కుక్కలకు ఆ పరేషన్లు చేయలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఒక్క కూకట్‌పల్లి జోన్ పరిధిలోనే ఐదేండ్ల కాలంలో రూ.8.50 కోట్లు కేటాయిస్తే రూ.6.95 కోట్లు ఖర్చుచేశారు. అంటే మిగిలిన జోన్లలో రూ.7 కోట్ల చొప్పున రూ.40 కోట్లపైనే ఉంటుంది.

1.50 లక్షల కుక్కల కాటు కేసులు

జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 4 లక్ష ల వీధి కుక్కలున్నాయి. ఐదేండ్లలో 1.50 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. వీధి కుక్కలకు సంబంధించిన ఫిర్యాదులు 50 వేలకుపైగా ఉన్నాయని సమాచారం.

సీఎం ఆదేశాలిస్తేనే..

హయత్ నగర్ ఘటనపై జీహెచ్ఎంసీ స్పందన నామమాత్రమేు. సీఎం రేవంత్ రె డ్డి జోక్యం చేసుకుని రిపోర్టు ఇవ్వాలని ఆదే శాలు జారీచేస్తే తప్ప అధికారులు కదలలేదని పలువురు కార్పొరేటర్లు విమర్శిస్తున్నా రు. సీఎం ఆదేశాల తర్వాత కమిషనర్ కర్ణ న్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అధికా రులపై సీరియస్ అయినట్టు తెలిసింది. వెం టనే పిల్లవాడిని పరామర్శించడానికి జీ హెచ్ఎంసీ అధికారులు వెళ్లారు తప్ప అం తకుముందు అసలు పట్టించుకోలేదనే వి మర్శలూ లేకపోలేదు.

కంచె చేను మేసినట్టు

జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని వీధి కు క్కలు ఉన్నాయని అధికారుల వద్ద లెక్క ల్లేవు. 2023లో బ్లూ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన లెక్కల ప్రకారం సుమారు 4 లక్షలు అని చెబుతున్నారు. వీధి కుక్కల నియంత్రణ, వ్యాక్సినేషన్ పేరుతో కోట్ల రూపాయలను స్వచ్ఛంద సంస్థలకు కట్టబెడుతున్నారు. అంతేకాదు గ్రేటర్‌లో వీధి కుక్కల సంరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థలు వాటి సంఖ్య పెరగాలని చూస్తున్నారు తప్ప నియంత్రించడానికి చర్యలు తీసుకోవడంలేదని నగరవాసులు విమర్శిస్తున్నారు. గ్రేటర్‌లో ఎంతో మంది పిల్లలు, పెద్దలు కుక్కకాటుకు బలి అవుతున్నారు. అయినా ఆయా స్వచ్ఛంద సంస్థలకు కుక్కల సంరక్షణ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ప్రజల ప్రాణాల గురించి మాట్లాడడంలేదని ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు.

Next Story