- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకునూరి మురళి ఒళ్లంతా విషం: RS ప్రవీణ్ కుమార్ ఫైర్
రేవంత్ పాలనలో విద్యావ్యవస్థ మీద కుట్రలు జరుగుతూనే ఉన్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్ పాలనలో విద్యావ్యవస్థ మీద కుట్రలు జరుగుతూనే ఉన్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మూడు రోజుల క్రితం విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఇచ్చిన నివేదికను మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చెత్తబుట్టలో వేస్తామని చెప్పారు. లక్షా 70 వేల మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. ఉపాధ్యాయుల జీతాలను నిర్ధారించాల్సింది విద్యాకమిషన్ కాదని.. పీఆర్సీ నిర్ణయించాలని అన్నారు. ఒళ్లంతా విషం నింపుకొని ఆకునూరి మురళి ఈ రిపోర్ట్ తయారు చేశారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్లతో కేసీఆర్ కృషిని తక్కువ చేసే ప్రయత్నం చేశారని.. ఇప్పుడు విద్యాకమిషన్ రిపోర్ట్‌తో ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన మెడికల్, నర్సింగ్ కాలేజీలు, స్పోర్ట్స్ అకాడమీలు ఆకునూరి మురళికి కనిపించలేదా అని ప్రశ్నించారు. విద్యావ్యవస్థకు రాజకీయాలు జత చేయొద్దని అంటూనే కేసీఆర్‌ను ఎందుకు విమర్శిస్తున్నారని నిలదీశారు. ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ రద్దు చేసి ఇంటర్ మార్కుల ద్వారా అడ్మిషన్లు ఇవ్వాలని కమిషన్ ఎలా చెబుతుందన్నారు. ఇంటర్ మార్కుల ద్వారా ఇంజినీరింగ్ సీట్లు అంటే నష్టపోయేది గ్రామీణ ప్రాంత విద్యార్థులు కాదా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇష్టం లేకనే విద్యా కమిషన్ రద్దు చేయాలని చెప్పించారని పేర్కొన్నారు. ‘మురళికి కోపం ఉంటే మమ్మల్ని కాల్చండి. పేద కుటుంబాల మీద ఎందుకంత కోపం?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నెలకోసారి విద్యా శాఖపై రివ్యూ చేస్తే సాధించిందేమిటన్నారు.






