- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసు: లేని ఆధారాలు సృష్టించి, ఇరికించాలని ప్రయత్నం.. ఆర్ఎస్ ప్రవీణ్ హాట్ కామెంట్స్
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును ఇరికించే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును ఇరికించే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 2024 మార్చిలో ఒక పోలీస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు ఇప్పటికీ ధారావాహిక వలే కొనసాగుతూనే ఉన్నదని.. ఇప్పటివరకు 350 మంది సాక్షులను విచారించినా ఛార్జ్‌షీట్ మాత్రం ఫైల్ చేయలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రెండుసార్లు సిట్ ఏర్పాటు చేశారని.. ఇది కేవలం రాజకీయ కక్షతోనే చేస్తున్నారని ఆరోపించారు. సాంకేతిక ఆధారాలతో సరైన సాక్ష్యాలతో విచారణ జరపాల్సిన కేసులో కావాలని కొంత మంది పాత నేరస్థులతో రాజకీయ నాయకుల పేర్లను చెప్పాలని ఒత్తిడి చేసి తప్పుడు ఆధారాలు సేకరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సైతం ఢిల్లీలో ఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణమైన అంశం అని.. ఏ ప్రభుత్వమైనా ట్యాపింగ్ చేస్తుందని చెప్పారని గుర్తుచేశారు.
ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అంశంలో గత అధికారులు ఎవరైనా తప్పు చేస్తే, చట్టబద్ధంగా విచారణ జరపాలి కానీ.. లేని ఆధారాలు సృష్టించి, ఫ్యాబ్రికేట్ చేసి, తప్పుడు సాక్ష్యాలు చూపి, రాజకీయ నాయకులను ఇరికించాలని చూడడం సరైంది కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ సీడీలు కూడా కోర్టుకు సమర్పించాల్సిన అవసరం లేదని.. ఫోన్ ట్యాపింగ్ అత్యంత గోప్యంగా జరిగే ప్రక్రియ అని.. బాధ్యత తెలియని హోంమంత్రి వల్ల డిపార్ట్మెంట్ నాశనం అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా పేర్కొన్న టి.ప్రభాకర్‌రావు అనే పోలీస్ అధికారిని 19 రోజులపాటు విచారణ పేరుతో మానసికంగా హింసించి, నేల మీద పడుకోబెట్టి, ఆయనకు బెయిల్ రాకుండా ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించిందన్నారు. అయినా.. సుప్రీంకోర్టు ప్రభాకర్‌రావుకు అనుకూలంగా తీర్పును ఇచ్చిందని గుర్తుచేశారు. ఎలాగైనా కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ పేర్లు చెప్పాలని, సంధ్యా శ్రీధర్‌రావు అనే వ్యక్తిని బలవంతపెడుతున్నారని ఆరోపించారు.






