- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RSP: పాఠశాల టెండర్లలో రూ.2వేల కోట్ల కుంభకోణం
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2వేల కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపి ఏఐసీసీకి ఏటీఎంగా పనిచేసే కంపెనీలకు కాంట్రాక్టులు అప్పజెప్పాలనే కుట్ర జరుగుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2వేల కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపి ఏఐసీసీకి ఏటీఎంగా పనిచేసే కంపెనీలకు కాంట్రాక్టులు అప్పజెప్పాలనే కుట్ర జరుగుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు అన్యాయం జరుగుతున్నదని.. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 10వేల నుండి 20 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కాంట్రాక్టర్లు తయారయ్యారని తెలిపారు. ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ సహకారం పొందిన ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ, కాంగ్రెస్ వచ్చి మూడేండ్లు అయినా రిజర్వేషన్లు ఇవ్వడం లేదని తెలిపారు. కాంగ్రెస్ పూర్తిగా ఎంఎస్ఎంఈలను నాశనం చేసిందన్నారు. జీవో 17ను గతంలో హైకోర్టు మార్పులు చేయాలని సూచించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. టెండర్లకు ఆహ్వానం పలుకుతూ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు.
ట్రంక్ బాక్స్, ప్లేట్లు, గ్లాసులు, యూనిఫాంలు, నోట్ బుక్స్ వంటి వస్తువుల సరఫరాకు దేశవ్యాప్తంగా టెండర్లకు ఆహ్వానం పలికిందని తెలిపారు. గతంలో జిల్లా వ్యాప్తంగా టెండర్లు పిలిచి కాంట్రాక్టులు ఇచ్చేవారని.. ఇప్పుడు దేశవ్యాప్తంగా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి సెంట్రలైజ్డ్ చేశారని ఆరోపించారు. నోట్ బుక్స్ సరఫరాలో అయితే భారీ కుట్ర దాగి ఉన్నదన్నారు. వాటర్ మార్క్ అనేది కరెన్సీ నోట్లకు, స్టాంప్ పేపర్లకు వాడే పేపర్ అని.. అలాంటి పేపర్ నోట్ బుక్స్‌కు ఎందుకని ప్రశ్నించారు. దీనికి బ్యాంక్ నుండి రూ.40 కోట్ల సాల్వెన్సీ కలిగి ఉండాలని.. టర్నోవర్ రూ.150 కోట్లు ఉండాలని.. షూస్ కాంట్రాక్ట్ కోసం రూ.20 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలని నిబంధన పెట్టారన్నారు. ఇవన్నీ పేద కాంట్రాక్టర్లకు ఉంటాయా? అని నిలదీశారు. అందుకే సీఎం, వారి అనుచరులకు, వారికి సంబంధించిన కంపెనీలకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పతనం మొదలైంది.. రేవంత్ పాలనపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు






