- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RSP: ‘రేవంత్ రెడ్డి గారు పోలీసులవి కూడా ప్రాణాలే.. జర గుర్తించండి’
పోలీసు ఆరోగ్య భద్రత(Police Health and Safety) కింద లభించే వైద్య సేవలు సోమవారం నుంచి పూర్తిగా బంద్ కానున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పోలీసు ఆరోగ్య భద్రత(Police Health and Safety) కింద లభించే వైద్య సేవలు సోమవారం నుంచి పూర్తిగా బంద్ కానున్నట్లు తెలుస్తోంది. దవాఖానాలకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం(Congress Govt) నిర్ణయం తీసుకోకపోవడంతో వైద్య సేవలు నిలిచిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం 20వ తేదీలోపు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అసోసియేషన్(Telangana Super Specialty Hospital Association) జనవరి 6వ తేదీన ఆరోగ్య భద్రత కార్యదర్శికి లేఖ రాసింది. ఈ లేఖపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని పోలీసు ఆరోగ్య భద్రత విభాగం అధికారుల చెప్పారు. తాజాగా ఈ అంశంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) స్పందించారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ప్రతిరోజు 24 గంటలు విధి నిర్వహణలో ఉండి శాంతి భద్రతలు కాపాడే పోలీసులకు కూడా తప్పని బకాయిల బాధలు. నిరంతరం ట్రాఫిక్‌లో విధులు నిర్వహించే పోలీసులు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడినా సరే ఆరోగ్య భద్రత ఉన్నదనే భరోసాతో విధులు నిర్వర్తించేవారు. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అనాలోచిత, నియంతృత్వ పోకడల వల్ల ఉద్యోగులకు కూడా బాధలు తప్పడం లేదు. రేవంత్ రెడ్డి గారు పోలీసులవి కూడా ప్రాణాలేనని గుర్తించండి’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ప్రతిరోజు 24 గంటలు విధి నిర్వహణలో ఉండి శాంతి భద్రతలు కాపాడే పోలీసులకు కూడా తప్పని బకాయిల బాధలు.
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 19, 2025
నిరంతరం ట్రాఫిక్ లో విధులు నిర్వహించే పోలీసులు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఊపిరితిత్తులు,గుండె సంబంధిత వ్యాధుల బారిన పడినా సరే ఆరోగ్య భద్రత ఉన్నదనే భరోసాతో విధులు… pic.twitter.com/oTfzaYSeVR






