- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RSP: సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వానికే క్లారిటీ లేదు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) కీలక ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) కీలక ఆరోపణలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు.
‘కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం(Sirpur Constituency)లోని కాగజ్ నగర్ మండలం భట్‌పల్లి గ్రామంలో పర్యటించాను. ఈ సందర్భంగా గ్రామస్తులతో చాలా విషయాలు మాట్లాడాను. వారు షాకింగ్ నిజాలు చెప్పారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు ఆగమైనయ్.. సర్పంచ్‌లు లేరు, పారిశుధ్య కార్మికులకు జీతాలు లేవు.. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్‌కు కూడా కష్టమైతున్నది. రోడ్లన్నీ చెత్తతో నిండిపోయినయ్.. డ్రైనేజీ కాలువల్లో మురుగు నీరు నిలిచి ఊరంతా దుర్వాసన వస్తుంది.. కేంద్రం, రాష్ట్రం నుండి గ్రామాలకు రావాల్సిన నిధులు ఆగిపోయినయ్.. సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఇప్పటికీ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి(CM Revanth Reddy) గారు మీ ఇంటి దగ్గర, మీరు నివసించే ప్రాంతంలో ఇలాగే దుర్వాసన వస్తుందా? ఇలాగే చెత్త పేరుకుపోయిందా? గ్రామాల్లో పేదలు ఏమై పోయినా మీకు పట్టింపు లేదా?.. తెలంగాణలో కాంగ్రెస్ పాలన దుర్గంధభరితం’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్టు పెట్టారు. దీనికి కాంగ్రెస్ శ్రేణులు నెగిటివ్‌గా, బీఆర్ఎస్ శ్రేణులు పాజిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు.
సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలం భట్ పల్లి గ్రామంలో పర్యటించి గ్రామస్థులతో మాట్లాడితే... షాకింగ్ నిజాలు చెప్పారు.
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 25, 2025
15 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు ఆగమైనయ్.
సర్పంచ్ లు లేరు,
పారిశుధ్య కార్మికులకు జీతాలు లేవు.
గ్రామ పంచాయితీ ట్రాక్టర్లకు డిజిల్ కు కూడా కష్టమైతున్నది.… pic.twitter.com/D8A2becWHZ






