- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును జైలుకు పంపే కుట్ర
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సీనియర్ నేతలను జైలుకు పంపాలని కుట్ర చేస్తున్నారని.. అక్రమ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సీనియర్ నేతలను జైలుకు పంపాలని కుట్ర చేస్తున్నారని.. అక్రమ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్‌కు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు. ఉత్తమ ఇంటెలిజెన్స్ అధికారిగా గుర్తింపు పొందిన రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్‌రావును ఏ1గా చేశారని.. చట్టబద్ధంగా విధులు నిర్వర్తించడమే ఆయన చేసిన పాపమా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పేర్లు చెప్పాలని ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని.. థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోపాటు చాలా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తెలుగు సీరియల్స్‌లాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపిస్తున్నారని.. మొదట ఏర్పాటు చేసిన సిట్‌తో ఏమీ తేలలేదని అన్నారు.
350 మంది సాక్షులను జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణ చేసినా ఏమీ తేలలేదన్నారు. మళ్లీ నలుగురు సీనియర్ ఐపీఎస్‌లతో సిట్ ఏర్పాటు చేశారని.. మళ్లీ విచారణ చేసి సాగదీస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీనియర్ ఐపీఎస్‌ను 14 రోజులపాటు పోలీస్ కస్టడీలో విచారించారని తెలిపారు. మంత్రుల ఫోన్లను ముఖ్యమంత్రి ట్యాపింగ్ చేయడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారన్నారు. సిట్ వేయాల్సింది సీఎం రేవంత్‌రెడ్డి పైన అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగానే జరిగిందని.. రికార్డులు తొలగించాలని కూడా చట్టమే చెబుతున్నదని తెలిపారు. ఇటువంటి కుట్రలు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని.. ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మహిళా ఐఏఎస్ అధికారిని మంత్రి వేధిస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయని.. మంత్రులు అసభ్యకర రీతిలో వేధించే స్థాయికి పరిపాలన దిగజారిందని అన్నారు. ఏపీ నీటిని తరలించుకుపోతున్నా.. సీఎం, మంత్రులు చూస్తూ పోతున్నారని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కె.కిశోర్‌గౌడ్, కె.వాసుదేవరెడ్డి, తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.






