బీఎస్‌పీకి RS ప్రవీణ్ కుమార్ రాజీనామా

by Disha Web Desk 2 |
బీఎస్‌పీకి RS ప్రవీణ్ కుమార్ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: బీఎస్‌పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఎస్‌పీ పార్టీకి, రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శనివారం బీఎస్‌పీ అధినేత్రి మాయావతికి పంపించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. బీఎస్పీ- బీఆర్ఎస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. మళ్లీ చెబుతున్నా.. చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటా. బీఎస్‌పీ రాజీనామా చేస్తున్నాను. ఈ నిర్ణయం బాధ అనిపించినా తప్పడం లేదు’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed