విద్యుత్ ప్రగతి కాదు అప్పుల ప్రగతి గురించి మాట్లాడు.. సీఎం కేసీఆర్ కు ఆర్ఎస్ ప్రవీణ్ సెటైర్లు

by Dishafeatures2 |
BSP Chief RS Praveen Kumar Says An acre of land for the poor if we are empowered
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విద్యుత్ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. విద్యుత్ ప్రగతి పేరుతో సీఎం కేసీఆర్ ఊకదంపుడు ముచ్చట్లు చెప్పే కేసీఆర్ కు విద్యుత్ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థల 40 వేల కోట్ల రూపాయల అప్పుల ప్రగతి గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

రైతులు అడగని 24గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం వెనుక ఉన్న చీకటి కొనుగోలు ఒప్పందాలు, ప్రభుత్వ పెద్దల వాటాలు, అన్నిటికీ మించి ఉద్యోగుల మద్య వివాదాలు సృష్టించి సంస్థల సొమ్ము దోచుకుంటున్న తీరును పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రమజీవుల (ఆర్టిసన్స్, అన్ మేన్డ్) కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్న వారు, అపరిపక్వ ఆలోచనతో వేలాది ఉద్యోగులను కూర్చోబెట్టి జీతాలిచ్చి సొంత రాష్ట్ర ఉద్యోగులకు రివర్షన్లు ఇచ్చిన ఈ ప్రభుత్వ అసమర్థతను కూడా పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వని మోసాన్ని పేద ప్రజలు ఎన్నటికీ మరచి పోరని గుర్తు చేశారు. అందుకే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ లో ఏనుగు గుర్తుకు ఓటేసి బహుజన రాజ్య స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed