- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సునీతకు ఒక న్యాయం.. నవీన్‌యాదవ్‌కు ఇంకో న్యాయమా?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీజేపీ, కాంగ్రెస్, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలపై ఎఫ్ఐఆర్ చేయాలన్నారు. సునీత కేసులో మొత్తం ఏడుగురు మీద కేసు పెడితే.. నవీన్ యాదవ్ ఒక్కరి మీదనే కేసు నమోదు చేశారని అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ, కాంగ్రెస్, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలపై ఎఫ్ఐఆర్ చేయాలన్నారు. సునీత కేసులో మొత్తం ఏడుగురు మీద కేసు పెడితే.. నవీన్ యాదవ్ ఒక్కరి మీదనే కేసు నమోదు చేశారని అన్నారు. సునీతకు ఓ న్యాయం నవీన్‌కు ఇంకో న్యాయమా? అని నిలదీశారు. కాంగ్రెస్ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆరోపించారు.
మానవతా విలువలు మరిచి మహిళలు, పిల్లల మీద ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని అన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ముందస్తు నోటీసు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ప్రచారంలో భాగంగా సునీత భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటే.. కాంగ్రెస్ నాయకులు కామెంట్ చేస్తున్నారని అన్నారు. శ్రీశైలం యాదవ్ వ్యక్తిగత అంశాలపై కామెంట్లు చేశారని.. తాము వ్యక్తిగత కుటుంబ విషయాలపై కామెంట్ చేయలేమా? అని హెచ్చరించారు.
నవీన్ యాదవ్ ఫేక్ ఐడీ కార్డు పంపిణీ చేసిన అంశాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ నెల 18న గ్రూప్ 2 విజేతలకు నియామక పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారని.. ఇది ఖచ్చితంగా నియోజకవర్గ ఓటర్లను ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ అమలులో ఉండగా సీఎం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చట్టవిరుద్ధమైన చర్యగా పరిగణించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు.






