- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ప్రజలకు ప్రైవసీ లేకుండా పోయింది: ఆర్ఎస్పీ
తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యక ప్రజలకు అసలు ప్రైవసీ లేకుండా పోయిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యక ప్రజలకు అసలు ప్రైవసీ లేకుండా పోయిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు పంజాగుట్ట పోలీసులు 14వ తేదీన నోటీసులు ఇచ్చారని అన్నారు. విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు. కానీ నోటీసులు రాకముందే ఆంధ్రజ్యోతి పత్రికలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌కు నోటీసులు అని రాశారన్నారు.
7వ తేదీనే ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ వంతు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అని రాశారని అన్నారు. తాను ఏదో నింధితుడిని అయినట్టు రాశారన్నారు. తరవాత మరోసారి నోటీసులు అని కూడా రాశారన్నారు. ఈ రన్నింగ్ కామెంట్రీ ఇస్తున్నది ఎవరని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాకుండా ఆ పత్రికా యాజమాన్యానికి విషయాలన్నీ ఎవరు చేరవేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని చట్టపరంగా మాత్రమే పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి అక్రమ ఆదేశాలు, దౌర్జన్యాలను అడ్డుకోవాలని అన్నారు.






