తెలంగాణ పోలీసులకు RSP సవాల్.. MLA గాదరి కిషోర్‌పై సీరియస్

by Disha Web Desk 2 |
తెలంగాణ పోలీసులకు RSP సవాల్.. MLA గాదరి కిషోర్‌పై సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పంచాయతీరాజ్ శాఖ అధికారిపై పరుష పదజాలం వాడారు. అధికారిపై నోరు పారేసుకోవడంతో అక్కడికి ప్రజలంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. తాజాగా.. ఈ వ్యవహారంపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ''వీళ్లు ఎమ్మెల్యేలా లేక కేసీఆర్, టీఆర్ఎస్ మాఫియా ముఠాలో గూండాలా? పింఛన్‌ల డబ్బు ఏమైనా మీ అయ్యల సొత్తా? పోలీసులకు ధమ్ముంటే ఈ ఎమ్మెల్యే మీద 353 IPC కింద సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. తెలంగాణ ప్రజలారా, రాబోయే ఎలక్షన్ల ఎవరి లాగులు మనం పలగొట్టాల్నో మీ కిప్పటికే అర్థం అయ్యిందనుకుంటున్నా.'' అంటూ సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేపై మండిపడ్డారు.


Next Story

Most Viewed