సిర్పూర్‌లో ఇల్లు కొన్నా.. గృహప్రవేశానికి అందరూ రండి.. ఆర్ఎస్పీ పిలుపు

by Dishafeatures2 |
సిర్పూర్‌లో ఇల్లు కొన్నా.. గృహప్రవేశానికి అందరూ రండి.. ఆర్ఎస్పీ పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎట్టకేలకు సిర్పూర్ గడ్డ మీద చిన్న ఇల్లు కొనుక్కున్నామని సోషల్ మీడియా వేదికగా బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. తమ ఇంటి నంబరు, 3-8 కోసిని గ్రామ పంచాయితిలో పేర్కొన్నారు. ‘నిజానికి తెలంగాణ మొత్తంతో నా ప్రస్థానం ముడిపడినప్పటికీ, మీ శేష జీవితం మా వద్దే గడపండి అని నన్ను అక్కున చేర్చుకున్న సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసినా తక్కువే. ఈ ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. చివరి శ్వాస వరకూ మీ మధ్యనే ఉంటానని, మీ కోసమే శ్రమిస్తానని మాటిస్తున్నా.’ అని తెలిపారు. ఎన్నికల్లో ఇక ఎవరు లోకల్- ఎవరు నాన్ లోకల్‌ నిర్ణయించాల్సింది సిర్పూరు ప్రజలేనని వెల్లడించారు. ఈ నెల 29 నాడు ఉదయం 11 గంటలకు మహనీయుల సాక్షిగా గృహప్రవేశం ఉంటుందని, సిర్పూరు విముక్తి కోరుకునే అందరికీ ఇదే మా మా ఆహ్వానం అంటూ పిలుపునిచ్చారు. మరోవైపు సిర్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ట్వీట్ ట్యాగ్ చేశారు.



Next Story

Most Viewed