- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్ విచారణకు రప్పించారు: ఆర్ఎస్పీ
తెలంగాణలో దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు పాలన సాగుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు పాలన సాగుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేటీఆర్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు 14 కేసులు పెట్టారని విమర్శించారు. కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్ విచారణకు రప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం గైడ్ లైన్స్‌కు విరుద్దంగా కేటీఆర్ పై కేసులు పెట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా లగచర్ల నుండి ఆదిలాబాద్ వరకు, మహబూబాబాద్ నుండి మహబూబ్ నగర్ వరకు ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి ఆగమేఘాల మీద పోయి అక్కడ ప్రజల తరుపున పోరాటం చేస్తున్న కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకోడానికి కేసులు పెట్టారని వ్యాఖ్యానించారు. కర్నాటక ప్రభుత్వం తొక్కిసలాట ఘటనలో ఆఫీసర్లను సస్పెండ్ చేసి తమ సీట్లను కాపాడుకుందని ఆరోపించారు. కానీ కేటీఆర్ ఫార్ములా-ఈ కేసు విషయంలో ఏ మంత్రి చేయని సాహసం చేశారన్నారు. వేరే ఏ మంత్రి అక్కడ ఉన్నా నేను చేయలేదు ఆఫీసర్లే చేశారంటారని చెప్పారు.






