కల్లీ కల్లు మృతులకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలి: ఎంపీ ఈటల

by Yella Dhawani Reddy |

కూకట్‌పల్లి(Kukatpally)లో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతిచెందగా, 22 మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

కల్లీ కల్లు మృతులకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలి: ఎంపీ ఈటల
X

దిశ, వెబ్ డెస్క్: కూకట్‌పల్లి(Kukatpally)లో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతిచెందగా, 22 మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీజీపీ ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajendar) స్పందించారు. బుధవారం ఆయన నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీకల్లు బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కల్తీకల్లు ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కల్తీ కల్లు ఎక్కువగా పేదవారే తాగుతున్నారని, ఇది వారి ప్రాణాలకు ముప్పు తెస్తుంది కాబట్టి వెంటనే ఈ దుకాణాలను కట్టడి చేయాలన్నారు. అలాగే, బాధితులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం తరుఫున వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని ఈటల డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం మద్యం విక్రయాన్ని అతిగా ప్రోత్సహిస్తోందని, ఔషధాల కంటే మద్యం దుకాణాలే నిరంతరం నడుస్తున్నాయని ఆరోపించారు.

Next Story