Sarawsati Pushkaralu : సరస్వతీ పుష్కరాలకు రూ.8 కోట్లు మంజూరు

by Muthe.Rajitha |   (  Updated:2025-05-13 15:10:18  IST  )

సరస్వతీ పుష్కరాలకు(Sarawsati Pushkaralu) రూ.8 కోట్ల నిధులను మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt).

Sarawsati Pushkaralu : సరస్వతీ పుష్కరాలకు రూ.8 కోట్లు మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్ : సరస్వతీ పుష్కరాలకు(Sarawsati Pushkaralu) రూ.8 కోట్ల నిధులను మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt). భూపాల‌ప‌ల్లి జిల్లా కాళేశ్వరం(Kaleshwaram) త్రివేణి సంగమం(Triveni Sangamam) వద్ద ప్రవహించే "అంతర్వాహిని" స‌ర‌స్వతీ న‌దీ పుష్కరాలు ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. అత్యంత ప‌విత్రమైన ఈ త్రివేణి సంగ‌మ స్నానానికి ల‌క్షలాది భ‌క్తులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా తరలిరానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

ఈ పుష్కరాలకు ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించింది. అందులో 16 పనులు చేసేందుకు రూ.21.56 కోట్లు, మిగిలిన రూ.3.43 కోట్లతో వీఐపీల ఘాట్లు ఏర్పాటు చేసేందుకు కేటాయించారు. తాజాగా మంజూరు చేసిన రూ.8 కోట్లను జిల్లా పంచాయతీరాజ్ కు రూ.50 లక్షలు, నీటి పారుదల శాఖకు రూ.94.67 లక్షలు, భూపాలపల్లి ఇంట్రా ఈఈ కి రూ.30 లక్షలు, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ రూ.55 లక్షలు, జిల్లా పంచాయతీ శాఖకు రూ.92.50 లక్షలు, ఎండోమెంట్ డిప్యూటీ ఈఈకి రూ.95 లక్షలు, గోదావరి హారతికి రూ.30 లక్షలు, మెడికల్, శానిటేషన్, పోలీసులకు అల్పఆహారం కోసం కోటి, జిల్లా మెడికల్ హెల్త్ డిపార్ట్ మెంట్ కు రూ.19.50 లక్షలు, ఆర్టీసీ, డీఎఫ్ఓ, ఆర్అండ్ బీ, మత్స్యశాఖలకు రూ.60 లక్షలు, ఇతర శాఖలకు కలిపి రూ.1.75 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు.

ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్ల వివరాలు భక్తులకు సమగ్రంగా తెలిపేందుకు కాళేశ్వరం సరస్వతి పుష్కరాల వెబ్ పోర్టల్, మొబైల్ యాప్‌ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha), మంత్రి శ్రీధ‌ర్ బాబు(Minister Sridhar Babu) ఇటీవ‌లే ప్రారంభించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు, టెంట్‌లు, శాశ్వత మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు.. ఆర్టీసీ బ‌స్సులను అవసరానికి అనుగుణంగా నడపాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కాగా సరస్వతీ పుష్కరాలకు హాజరవ్వాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మంత్రి కొండా సురేఖ ప్రత్యేకంగా ఆహ్వానించారు.

Next Story