- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిరిజన, బంజారా భవనాలకు రూ.16.50 కోట్లు
గిరిజన, బంజారాల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు..

- ఏటూరు నాగారం, ఉట్నూరు ఐటీడీఏ నూతన భవనాల నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు
- గిరిజన, బంజారాల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం
- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో : గిరిజన, బంజారాల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి వారి జీవిత ప్రమాణాల మెరుగుదలకు అనేక కార్యక్రమాలు చేపట్టారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితో ముందుకు వెళ్తున్నారన్నారు. గురువారం ప్రభుత్వం గిరిజన, బంజారా భవనాలకు రూ.16.50 కోట్లు, ఏటూరు నాగారం, ఉట్నూరు ఐటీడీఏ నూతన భవనాల నిర్మాణానికి చెరో రూ.15 కోట్లు చొప్పున మొత్తం రూ.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రూ.16.50 కోట్లు వ్యయంతో 6 కొత్త గిరిజన, బంజారా భవనాల నిర్మాణం, ఇప్పటికే ఉన్న 9 భవనాలకు అదనపు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపింది. ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహకారంతో గిరిజన సంక్షేమ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నామన్నారు. ఉట్నూరు, ఏటూరు నాగారం ఐటీడీఏ భవనాలు శిథిలావస్థలో ఉండటంతో, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేసిన విజ్ఞప్తి మేరకు తాను వ్యక్తిగతంగా సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరులో ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ కొత్త భవనాలు గిరిజనుల సాంస్కృతిక, విద్యా, పరిపాలనా కార్యకలాపాలకు కేంద్రాలుగా నిలిచి వారి సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిధుల కేటాయింపు వివరాలు
ఉట్నూర్(ఖానాపూర్), నిర్మల్, దేవరకొండ, కరీంనగర్, హుజూర్‌నగర్ (సూర్యాపేట), మన్ననూరు(అచ్చంపేట) లకు రూ.50 లక్షలు చొప్పున కేటాయించారు. వికారాబాద్ 59 లక్షలు కేటాయించగా, పెద్దూరు (సిరిసిల్ల), కూసుమంచి, తిరుమలయపాలెం(ఖమ్మం)లకు రూ. కోటి చొప్పున కేటాయించారు. బాచుపల్లి(కుత్బుల్లాపూర్), మంచిర్యాల, నారాయణఖేడ్, కేసముద్రం (మహబూబాబాద్), ఖమ్మం రూరల్(ఖమ్మం) లకు రెండు కోట్ల చొప్పున నిధులను కేటాయించారు.






