- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
400 ఎకరాల కోసం RRR అలైన్‌మెంట్ చేంజ్.. హరీశ్‌రావుపై కవిత తీవ్ర ఆరోపణలు
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) జిల్లా పర్యటన జోరుగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) జిల్లా పర్యటన జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె బీఆర్ఎస్ (BRS) ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతూ ముందుకెళ్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)పై కవిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో కవిత మాట్లాడుతూ.. రెడ్డిపల్లి, చిప్పలతుర్తి, తుంకి ఈ మూడు గ్రామాల మధ్య హరీశ్ రావుకు చెందిన 400 ఎకరాల ఫామ్‌హౌస్ ఉందన్నారు. ఈ క్రమంలోనే రీజినల్ రింగ్ రోడ్డు (RRR)తో భూముల వాల్యూ పెరిగేందుకు ఆ ఫామ్‌హౌస్ పక్కనుంచే పోయేలా అలైన్‌మెంట్ మార్చారని ఆరోపించారు. అక్కడ ఓ ఫైవ్ స్టార్ రిసార్టు కూడా నడుపుతున్నారనే విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం కవిత చేసిన ఆరోపణలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, మరోవైపు తెలంగాణ సర్కార్ హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు 40 కి.మీ. దూరంతో రెండు భాగాలుగా ఆర్‌ఆర్‌ఆర్ రోడ్డును నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటుగా టెండర్లు కూడా పిలిచింది. ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌పై హెచ్‌ఎండీఏ (HMDA) ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. వంద మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డును నిర్మించనున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల ఎనిమిది జిల్లాల మీదుగా వెళ్తుంది. ఈ నోటిఫికేషన్‌లో డిజిటల్ మ్యాప్‌తో పాటు, ఆర్‌ఆర్‌ఆర్ వెళ్లే సర్వే నంబర్ల వివరాలను కూడా వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు కింద రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి-భువనగిరి జిల్లాల పరిధిలోని 33 మండలాలు, 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలను కవర్ చేయనుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఆయా ప్రాంతాల్లోని భూములకు విలువ పెరగడంతో పాటు, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు.






