స్కిన్ గ్రాఫ్టింగ్: కాలిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ బలం

by Naga Rani Yarlagadda |

అగ్ని ప్రమాదాల్లో గాయపడిన వారికి ట్రీట్‌మెంట్ అందించడంలో ప్లాస్టిక్ సర్జన్ల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. క్షతగాత్రుల్లో తీవ్ర గాయాలైన వారిని గుర్తించి బర్న్ వార్డుకు తరలిస్తారు. వీరికి వైద్యం అందించడంలో మిగతా వైద్యులకన్నా ప్లాస్టిక్ సర్జన్ల పాత్ర ఎంతో ఉంటుంది.

స్కిన్ గ్రాఫ్టింగ్: కాలిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ బలం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అగ్ని ప్రమాదాల్లో గాయపడిన వారికి ట్రీట్‌మెంట్ అందించడంలో ప్లాస్టిక్ సర్జన్ల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. క్షతగాత్రుల్లో తీవ్ర గాయాలైన వారిని గుర్తించి బర్న్ వార్డుకు తరలిస్తారు. వీరికి వైద్యం అందించడంలో మిగతా వైద్యులకన్నా ప్లాస్టిక్ సర్జన్ల పాత్ర ఎంతో ఉంటుంది. ఇతర ప్రమాదాల్లో ఏర్పడే గాయాలకు, అగ్ని ప్రమాద సమయంలో కలిగే గాయాలకు చాలా తేడా ఉంటుంది. ఈ కాలిన గాయాలను నాలుగు డిగ్రీలుగా విభజిస్తారు. ఇందులో మొదటి స్థాయి డిగ్రీ కాలిన గాయాలకు కేవలం కొద్ది నిమిషాల్లోనే ట్రీట్‌మెంట్ అందించవచ్చు. ఇక రెండో డిగ్రీ కాలిన గాయాల్లో చిన్న చిన్న పొక్కులతోపాటు చర్మం మొదటిపొర కాలిపోయి నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇందులో లోపలి పొరలు కాలిపోయే అవకాశం ఉంది. దీని ద్వారా బాధితుడు స్పర్శ కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మూడో స్థాయి కాలిన గాయాల్లో చర్మంలోని అన్ని పొరలు కాలిపోయి నరాలు డ్యామేజ్ అవుతాయి. ఈ సమయంలో అత్యవసరంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. లేట్ చేస్తే ఆయా భాగాలకు స్పర్శ, కదలికలు పూర్తిగా లేకుండా పోతుంది. నాలుగో డిగ్రీ కాలిన గాయాల్లో చర్మంతో పాటు నరాలు, కండరాలు, ఎముకలు, అంతర్గత అవయవాలు సైతం ఎఫెక్ట్ అవుతాయి. దీంతో ప్రాణాపాయం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కాలిన గాయాల లోతు, సైజు, ప్రదేశాన్ని బట్టి తదనంతర చికిత్సకు వైద్య నిపుణులు ప్లాన్ చేస్తారు. ఈ సమయంలోనే ప్లాస్టిక్ సర్జన్స్ రంగంలోకి దిగుతారు.

ఈ చర్యలు తప్పనిసరి

కాలిన గాయాల పేషెంట్ సంరక్షణకు ఒక క్రమబద్ధమైన వైద్య విధానం ఉంది. ఇది ఆరు ‘సీ’ ఆంగ్ల అక్షరాలతో మొదలు అవుతాయి. క్లాతింగ్ (కాలిన ప్రాంతంలో దుస్తులను తీసివేయడం), కూలింగ్ (చల్లని ప్రాంతంలో ఉంచడం), క్లీనింగ్ (గాయాలను క్లీన్ చేయడం), కీమోప్రోప్లయాక్సిస్ (యాంటి బయాటిక్స్ ఇవ్వడం), కవరింగ్ (గాయాలను బ్యాండేజ్ ద్వారా కవర్ చేయడం), కంఫర్టింగ్ (అంటే, నొప్పి నివారణ)

ట్రీట్‌మెంట్ ఇలా..

ముఖ్యంగా మొదటి రెండు డిగ్రీల స్థాయి కాలిన గాయాల్లో ప్రాణాపాయ పరిస్థితి ఉండదు. అగ్ని ప్రమాదబాధితులను తీసుకొచ్చిన సమయంలో తీవ్ర గాయాలపాలైన వారిని గుర్తించి వారికి ప్రాథమిక చికిత్స అందిస్తారు. తరువాత కాలిన చర్మాన్ని తొలగించే ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత ‘స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్’ ద్వారా అదే ప్రాంతంలో తిరిగి చర్మం వచ్చే విధంగా సర్జరీ చేస్తారు. మరోవైపు ‘ఫ్లాప్ రీ కన్‌స్ర్టక్షన్ మెథడ్’ ద్వారా డ్యామేజ్ అయిన టిష్యూస్‌కు తిరిగి జీవం పోస్తారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా కాలిన గాయాల ప్రాంతంలో మెడికల్ మేనేజ్‌మెంట్‌ను నిర్వహిస్తారు. సంబంధిత అవయవాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా, కీలకమైన కండరాలు, నరాలను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా అతికించి వ్యక్తి సాధారణ స్థితికి వచ్చేలా తోడ్పడుతారు.

Next Story