- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎంకు ఆ సీడీలు ఇచ్చింది రోహిత్ రెడ్డే!
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో మొదటి నుంచి అన్ని ఆటంకాలే ఎదురవుతున్నాయనని దవే కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మొదట ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్‌కు నిరాకరించింది. 41 సీఆర్పీసీ జారీ మీద నిందితులు కోర్టు వచ్చారు. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ తర్వాత ట్రాప్ జరగలేదని, ట్రాప్ జరిగిన తర్వాతే సీఎం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారని అన్నారు. విచారణ అధికారిపై అనుమానాలు ఉంటే సరిపోదని దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉండాలన్నారు. సింగిల్ బెంచ్ తీర్పులో ఉన్న అభ్యంతరాలను కోర్టుకు వివరించిన దవే.. సీక్రెట్ కెమెరాలు, ఆడియో రికార్డర్లలో నమోదైన ఆడియోలను ముగ్గురు నిందితులు ఒప్పుకున్నారని, అక్కడక్కడ అమర్చిన నాలుగు ఎలక్ట్రానిక్ పరికరాలను ఏసీపీ సీజ్ చేసిందని చెప్పారు. ఆడియో రికార్టులు తమవే అని నిందితులు ఒప్పుకున్నారని ఇవన్నీ మొదటి రిమాండ్ అప్లికేషన్ రోజే ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేశామన్నారు. వీడియో, ఆడియో క్లిప్ లు మీడియా మాధ్యమాల్లోకి వెళ్లిన తర్వాతే సీఎం ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు.
ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ కంటే నాలుగు రోజుల ముందే బీజేపీ కోర్టును ఆశ్రయించిందని తమ పరువుకు భంగం కలిగే విధంగా ఉంది అని బీజేపీ కోర్టుకు చెప్పిందన్నారు. ఈ కేసును ఆపాలని బీజేపీ మొదటి నుంచి చూస్తోందని ప్రభుత్వాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే సీఎం మీడియా సమావేశం ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రభుత్వాన్ని కూలుస్తుంటే ఏ ముఖ్యమంత్రి చూస్తూ ఉండలేడని అందుకే ఈ అంశంపై సీఎం రియాక్ట్ అయ్యారని కోర్టుకు వివరించారు. ట్రాప్ అనేవి సుప్రీం కోర్టు సమర్దించించిందని, ఒకవేళ ట్రాప్ చేయకపోతే వాళ్ళ ఆఫర్లు, వాళ్ళ బెదిరింపులు లాంటి వాటికి సాక్షాలు ఎలా దొరుకుతాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని బీజేపీ ఉద్దేశమని ఫామ్ హౌస్ కేసులో బీజేపీపై ఆరోపణలు ఉన్నాయన్నారు. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తే ఎలా అని, సీబీఐ అనేది కేంద్రంలోని బీజేపీ కంట్రోల్‌లో పని చేస్తుందని దాంతో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని అనుమానం వ్యక్తం చేశారు.
నా క్లయింటే ఆ సీడీలు ఇచ్చాడు
అనంతరం రోహిత్ రెడ్డి తరపున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. సీఎంకు తన క్లయింటే సీడీ ఇచ్చారని చెప్పారు. నిందితులకు దర్యాప్తు సంస్థను ఎంచుకునే అధికారం ఉందా అని ప్రశ్నించారు. కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి అప్పగించడం సరికాదన్నారు. ఈ కేసులో ప్రతిపాదిత నిందితుడైన తుషార్ తరపున న్యాయవాది సంజయ్ వాదించారు. సీబీఐ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని అది ఏ పార్టీకి కొమ్ముకాయదని అన్నారు. సిట్‌లో ఉన్న అధికారుల ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లు, పోస్టింగులు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని అన్నారు. సీఎం ప్రెస్ మీట్ వల్లే ఆధారాలు పబ్లిక్ లోకి వచ్చాయని వివరించారు. నేరం రుజుకు కాకముందే సీఎం కొంత మందిని నిందితులుగా ఎలా ముద్ర వేస్తారని ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ రేపు మధ్యాహ్నం 1 గంటకు వాయిదా వేసింది. రేపటి విచారణలో ఒక దవే మినహా మిగిలిన ప్రతివాదుల వాదనలు పూర్తి చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది.
Read more:






