బిగ్ బ్రేకింగ్: తెలంగాణ కేడర్ నుండి సోమేష్ కుమార్ ఔట్

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: తెలంగాణ కేడర్ నుండి సోమేష్ కుమార్ ఔట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఏపీ కేడర్‌కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయనను తెలంగాణ కేడర్ నుండి కేంద్రం రిలీవ్ చేసింది. తిరిగి సోమేష్ కుమార్‌ను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 12వ తేదీలోపు (గురువారం) ఏపీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు సోమేష్ కుమార్‌ను ఏపీకి వెళ్లాలని తీర్పునిచ్చిన గంటల వ్యవధిలోనే కేంద్రం రిలీవ్ ఆర్డర్ జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ నూతన సీఎస్‌గా రామకృష్ణరావు?

Next Story