హైదరాబాద్‌లో దొంగల బీభత్సం.. కానిస్టేబుల్ ఇంటిలోనూ చోరీ

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు ఊరెళ్ల‌డంతో తాళం వేసి ఉన్న ఇళ్ల‌ను టార్గెట్ చేస్తూ చోరీ చేస్తున్నారు. గ‌త రెండు మూడు రోజులుగా న‌గ‌రంలో త‌ర‌చూ దొంగ‌త‌నాలు జ‌ర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

హైదరాబాద్‌లో దొంగల బీభత్సం.. కానిస్టేబుల్ ఇంటిలోనూ చోరీ
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు ఊరెళ్ల‌డంతో తాళం వేసి ఉన్న ఇళ్ల‌ను టార్గెట్ చేస్తూ చోరీ చేస్తున్నారు. గ‌త రెండు మూడు రోజులుగా న‌గ‌రంలో త‌ర‌చూ దొంగ‌త‌నాలు జ‌ర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. శ‌నివారం హైదరాబాద్ మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. కేవ‌లం 24గంట‌ల వ్య‌వ‌ధిలోనే నాలుగు ఇళ్ల‌లో చోరీలు జ‌రిగాయి. అందులో ఓ కానిస్టేబుల్ ఇల్లు కూడా ఉండ‌టం షాకింగ్ గా మారింది. ఇళ్ల‌లోకి దూరిన దుండ‌గులు బంగారం, వెండి మ‌రియు న‌గ‌దుతో పాటు ఖ‌రీదైన వ‌స్తువుల‌ను ఎత్తుకెళ్లిన‌ట్టు బాధితులు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం చోరీల‌కు సంబంధించిన సీసీ టీవీ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వీడియోల్లో దొంగ‌లు ఎలా వ‌చ్చారు.. ఎలా దోచుకున్నారు అనేది పూర్తిగా రికార్డ్ అయింది. వీడియోల్లో ఒక బైక్ పై వ‌చ్చిన ఇద్ద‌రు దొంగ‌లు కాల‌నీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్ల‌నే వెతుకుతూ కనిపిస్తున్నారు. తాళం లేని ఇల్లు క‌నిపిస్తే అక్క‌డ బైక్ ఆపి ఇంట్లోకి దూరిన‌ట్టు కనిపిస్తుంది. దొంగ‌ల్లో ఒకరు మాస్క్ వేసుకోగా మ‌రొక‌రు మాస్క్ లేకుండా ఉండ‌టంతో ముఖం క్లారిటీగా క‌నిపిస్తుంది. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుప‌తున్నారు.

Next Story