- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నుమాయిష్ వేదికగా రహదారి భద్రత పాఠాలు
హైదరాబాద్ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే నుమాయిష్ లో నగర పోలీసులు సందడి చేశారు. ప్రజలకు రక్షణ, వివిధ భద్రత అంశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నుమాయిష్ లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే నుమాయిష్ లో నగర పోలీసులు సందడి చేశారు. ప్రజలకు రక్షణ, వివిధ భద్రత అంశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నుమాయిష్ లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ను హైదరాబాద్ సీపీ సజ్జనార్, అడిషనల్ డీజీపీ చారు సిన్హా ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అనగానే చార్మినార్, బిర్యానీతో పాటు నుమాయిష్ కూడా నగర గుర్తింపులో ఒక భాగమని అన్నారు. 1938లో కేవలం పదుల సంఖ్యలో స్టాల్స్‌తో ప్రారంభమైన ఈ ప్రదర్శన.. నేడు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా ఎదిగిందని వెల్లడించారు. 85 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ వేదిక జాతీయ సమైక్యతకు, గంగా-జమునా తహజీబ్ సంస్కృతికి అద్దం పడుతోందని సజ్జనార్ కొనియాడిన కొనియాడారు. ఇక నుమాయిష్ లో పోలీసులు ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. స్టాల్ లో ట్రాఫిక్ నిబంధనల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలిసేలా ఏర్పాట్లు చేశారు.






