- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులను వెంటాడుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు.. నెల గడవకముందే మూడు యాక్సిడెంట్లు
రోడ్డు ప్రమాదాలు తెలంగాణ పోలీసులను వెంటాడుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పోలీస్ (TG Police) శాఖలో వరుస విషాదాలు తీవ్ర విషాదం రేపుతున్నాయి. విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదం రూపంలో (Road Accidents) మృత్యువు దూసుకువస్తుండటం డిపార్ట్ మెంట్ లో కలవరపాటుకు గురి చేస్తున్నాయి. నెల రోజులు గడవక ముందే ఇద్దరు పోలీసులు మరణించగా మరో మహిళ ఎస్ఐ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. దీంతో ప్రజలకు రక్షణగా ఉండే తమ కుటుంబ సభ్యులు డ్యూటీ ముగించుకుని క్షేమంగా ఇంటికి చేరుకోగలరా అనే ఆందోళన ఇప్పుడు పోలీసు కుటుంబాల్లో వ్యక్తం అవుతోంది.
నెల రోజుల్లో మూడు ప్రమాదాలు:
తాజాగా మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. కూకట్ పల్లి నుంచి మియాపూర్ (Miyapur) వైపు వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి యూటర్న్ సమీపంలోని ట్రాఫిక్ అంబ్రెల్లాను ఢీ కొట్టింది. ఆ సమయంలో అక్కడ ట్రాఫిక్ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు రాజవర్ధన్, వికేందర్, సింహచలం తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సింహాచలం మృత్యువాత పడ్డారు. ఇక గత నెల 20వ తేదీ అర్థరాత్రి కామారెడ్డి (Kamareddy) జిల్లా గాంధారి మండల కేంద్రంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కానిస్టేబుల్ రవిని వేగంగా దూసుకువచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో రవి స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోగా రవితో పాటు విధులు నిర్వహిస్తున్న సుభాష్ అనే మరో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి.గత నెల 31వ తేదీన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో డ్రంగ్ అండ్ డ్రైవ్ టెస్టు చేస్తుండగా మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఎస్ఐ నాగలక్ష్మిని (SI Nagalakshmi) కారుతో ఢీ కొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో నాగలక్ష్మి గాయాలతో బయపడ్డారు. అనంతరం ఆ కారును పోలీసులు చేంజిగ్ చేసి పట్టుకున్నారు. ఇలా విధుల్లో ఉండగా వరుస ప్రమాదాలు ఎదురవుతుండటం ఇప్పుడు పోలీసు శాఖలో ఆందోళన వ్యక్తం అవుతోంది.






