- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BC reservations: పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే ఒప్పుకోం: ఆర్.కృష్ణయ్య
మరో రెండు నెలలు ఎన్నికలు వాయిదా పడితే ఏమవుతుందని ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన కృష్ణయ్య.. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే అంగీకరించబోమన్నారు. జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని సరైన వాదనలు వినిపిస్తే కోర్టు స్టే ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. బీసీల తరఫున హైకోర్టులో వాదనలు వినిపిస్తామని అవసరం అయితే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. సంవత్సరం నుంచి ఎన్నికలు వాయిదా పడుతున్నాయని మరో రెండు నెలలు వాయిదా పడితే ఏమవుతుందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్నికలు నాలుగేళ్లు వాయిదా పడ్డాయని గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ తరహా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.






