R.Krishnaiah: వాటికి మాత్రమే మేం వ్యతిరేకం.. బీసీ రిజర్వేషన్లకు కాదు

by Gantepaka Srikanth |

బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కీలక వ్యాఖ్యలు చేశారు.

R.Krishnaiah: వాటికి మాత్రమే మేం వ్యతిరేకం.. బీసీ రిజర్వేషన్లకు కాదు
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రిజర్వేషన్లు అమలుచేసే అధికారం రాష్ట్రానికి ఉందని అన్నారు. కాంగ్రెస్‌కు చేతకాక కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదని చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని అన్నారు. దీనిపై పదే పదే కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆర్‌.కృష్ణయ్య ప్రకటించారు.

Next Story