- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : విద్యాహక్కు చట్టం అమలు చేయలేం : తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్
తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(TRSMA) సోమవారం విద్యాహక్కు చట్టం(RTE) అమలుపై సంచలన ప్రకటన చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(TRSMA) సోమవారం విద్యాహక్కు చట్టం(RTE) అమలుపై సంచలన ప్రకటన చేసింది. ప్రభుత్వం పెండింగ్ బకాయిలను చెల్లించకపోవడంతో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయలేమని, 25% ఉచిత సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రైవేట్ స్కూళ్లు ఉచిత విద్యను అందించే స్థితిలో లేవని తెలియజేశారు. ప్రభుత్వం తల్లిదండ్రుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయాలని, ఆ డబ్బుతో వారు ఇష్టమైన స్కూళ్లలో పిల్లలను చేర్పించుకోవచ్చని సూచించారు.
అలాగే ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను ప్రభుత్వం నియంత్రించాలని, స్కూళ్లను వాటి సదుపాయాల ఆధారంగా ABCD కేటగిరీలుగా విభజించాలని TRSMA డిమాండ్ చేసింది. ఈ విభజన ఫీజు నిర్ణయంలో పారదర్శకతను, స్కూళ్ల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. తెలంగాణ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్ ఫీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ డ్రాఫ్ట్ బిల్లు-2025లో ప్రతిపాదించిన ఫీజు నియంత్రణ, RTE అమలు పర్యవేక్షణకు సంబంధించిన చర్చల నేపథ్యంలో TRSMA ఈ డిమాండ్స్ ను సర్కారు ముందు ఉంచింది. ఈ బిల్లు ప్రైవేట్ స్కూళ్లలో 25% సీట్ల రిజర్వేషన్‌ను పర్యవేక్షించాలని, ఫీజు పెంపును కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్‌తో అనుసంధానించాలని సూచించింది.
అయితే, TRSMA ఈ బిల్లులోని కొన్ని ప్రతిపాదనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. పేరెంట్-టీచర్ కమిటీకి బదులు స్కూల్ గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని, కేటగిరీల విభజనలో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరింది. కాగా తెలంగాణలో RTE చట్టం ప్రకారం 25% సీట్లను ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించాలనే నిబంధన ఉండగా.. ఇప్పటికే దీనికి సంబంధించిన రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది.






