ధనవంతుల సన్నబియ్యం దళారుల గూటికి

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో ధనవంతులు తీసుకోవాల్సిన సన్నబియ్యం రేషన్​మాఫియా గూటికి చేరుతున్నాయి.

ధనవంతుల సన్నబియ్యం దళారుల గూటికి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ధనవంతులు తీసుకోవాల్సిన సన్నబియ్యం రేషన్​మాఫియా గూటికి చేరుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా రేషన్​కార్డులు పొందిన లబ్దిదారులు కోటీశ్వర్లు కావడంతో మొదటి నుంచి వారు ఉచిత బియ్యం తీసుకోవడం లేదు. వారు బ్లాక్​మార్కెట్​లో దర్జాగా అమ్మకాలు చేశారు. ఇలాంటి దందా నడవకూడదనే లక్ష్యంతో ఏప్రిల్ ​నుంచి ప్రభుత్వం సన్నబియ్యం పథకం తీసుకొచ్చింది. దొడ్డు పంపిణీ చేయడంతో పేదలు వాటిని వినియోగించడం లేదని వాటిని దళారులకు అమ్మకాలు చేస్తున్నారని పలు తనిఖీలో బయటపడింది. దీంతో ప్రభుత్వం పీడీఎస్​రైస్​అక్రమ రవాణను అడ్డకునేందుకు సన్నబియ్యం పథకం తీసుకొచ్చిన రేషన్​మాఫియా తన దందాకు కొత్త మార్గాలు వెతుకుతూ కొనసాగేందుకు ప్లాన్​చేస్తోన్నట్లు తెలిసింది. రేషన్​డీలర్ల సహాయంలో గతంలో ఉచిత బియ్యం తీసుకోని వారి వివరాలు ఇవ్వాలని కోరడంతో వారు ఇచ్చిన జాబితా ప్రకారం రేషన్​కార్డు దారులకు ఫోన్​చేసి మీరు రేషన్​బియ్యం తీసుకోవడం లేదుగా తమకు ఇస్తే కిలో రూ. 25 ఇస్తామని పేర్కొనడం అక్రమ కార్డు దారులంతా ఉచితంగా వచ్చిన డబ్బును ఎందుకు వదులుకోవాలని భావిస్తూ తమ రేషన్​కార్డు నెంబర్​వంటి వివరాలిస్తూ డీలర్ల వద్దకు దళారుల అనుచరులు వెళ్లితే ఓటిపి నెంబర్​చెబుతూ అక్రమ రైస్​దందాకు ధనవంతులు కుటుంబాలు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పెద్ద హోటళ్లకు సరఫరాకు ప్లాన్​: దళారులు సన్నబియ్యం కొనుగోలు చేసి నగరంలో పెద్ద హోటళ్లతో పాటు పక్క రాష్ట్రాలైన ఏపి, కర్నాటక, ఒరిస్సా, గోవాలోని తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో డీలర్లు దనవంతులకు సంబంధించిన రైస్​ను వారే తీసుకుని రూ.3 లాభంతో దళారులకు క్వింటాల్​కొద్దిగా అమ్మేవారు. ఈసారి తమకు ఇబ్బందులు ఎదురైతాయనే భయంతో దళారులకు సహకరిస్తూ కమిషన్​తీసుకుంటున్నట్లు రేషన్​దుకాణాల వద్ద చర్చ జరుగుతోంది. డీలర్లు, దళారులు కుమ్మకై సన్నబియ్యం తింటే రోగాలు వస్తాయని, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇతర కూలీలు సక్రమంగా పనిచేయలేరని, వాటిని వండితే పోషకాలు ఉండవని రేషన్​కోసం లబ్దిదారులు వస్తే సన్నబియ్యంపై అసత్య ప్రచారం చేస్తూ తమకు బియ్యం ఇవ్వాలని కోరుతున్నారు.

రాష్ర్టంలో 8 నుంచి 10 లక్షల వరకు అక్రమకార్డులు : ప్రభుత్వం పంపిణీ చేసే సన్నబియ్యం పథకానికి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. అక్రమంగా ఉన్న రేషన్​కార్డులు ఏరివేయకుండా అందరికి ఇవ్వడంతో గతంలో మాదిరిగా పీడీఎస్​రైస్​పక్కదారి పడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 90.71 లక్షల కార్డులు ఉండగా 2.93 కోట్ల మంది లబ్దిదారులు ప్రయోజం పొందుతున్నారు. వీరికి నెలకు ప్రభుత్వం 1.86లక్షల మెట్రిక్​టన్నులు బియ్యం సరఫరా చేస్తోంది. ప్రస్తుతం కార్డులో 8 నుంచి 10 లక్షల వరకు అక్రమ కార్డులు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఆరోగ్య శ్రీ, సంక్షేమ శాఖల నుంచి రాయితీ రుణాలు, పిల్లలకు స్కాలర్​షిప్ లు పొందేందుకు కార్డులు తీసుకున్నట్లు గతంలోనే గుర్తించారు. గ్రేటర్​హైదరాబాద్​పరిధిలోనే 1.50 లక్షల కార్డులు ఉన్నట్లు గుర్తించి గత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా వాటి గురించి పట్టించుకోలేదు. దీంతో ఆకార్డులు అదే విధంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్​ప్రభుత్వం తొలగిస్తుందని అధికారులు భావించినప్పటికి వాటి ఊసే ఎత్తడం లేదని జిల్లాల పౌరసరపరాల అధికారులు వెల్లడించారు.

Next Story