- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rice Mill Association: పౌరసరఫరాల నూతన కమిషనర్‌ను కలిసిన రైస్ మిల్లు అసోసియేషన్
by Ramesh Naini |
రాష్ట్ర పౌరసరఫరాల నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ రైస్‌మిల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ,తెలంగాణ బ్యూరో : (Civil Supplies Commissioner) రాష్ట్ర పౌరసరఫరాల నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ రైస్‌మిల్స్ అసోసియేషన్ (Rice Mill Association) ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆయనను రాష్ట్ర రైస్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాడి గణపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉత్కూరి వీరేశం, కోశాధికారి వెంకట రమణతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలిశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి తాము మద్దతుగా నిలుస్తామని, తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్దానంలో నిలిచిందని పేర్కొన్నారు. ప్రభుత్వం సేకరించిన తమకు ఇచ్చిన ధాన్యం సకాలంలో సీఎంఆర్ చేసి అందజేస్తామని తెలిపారు.
Next Story






