విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు

by Elthuri vijay kumar |

“ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చిందని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు
X

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు

విద్యార్థులకు గుణాత్మకమైన విద్యా బోధన అందించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

దిశ, కార్వాన్: “ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చిందని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులు” అని అన్నారు. మంగళవారం అబిడ్స్‌ లోని స్టాండ్లీ కాలేజీలో ఉపాధ్యాయ దినోత్సవం–2025 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులే విద్యార్థులలో జ్ఞానం, నైతిక విలువలు, క్రమశిక్షణ నింపి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారని అన్నారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, ఏఐ పాఠాలు, యంగ్ ఇండియా పాఠశాలలు వంటి పథకాల ద్వారా విద్యా రంగాన్ని సమూలంగా మార్చిందని వివరించారు. “ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సీఎం, సీఎస్, డీజీపీ లాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నామోషీ కాదని రుజువైంది” అని అన్నారు. హైదరాబాద్ జిల్లాలో 108 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. “ఈ అవార్డులు మీ నిరంతర శ్రమకు, అంకితభావానికి గుర్తింపు మాత్రమే” అని మంత్రి ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ హరి చందన మాట్లాడుతూ.. “మొదటి గురువులు తల్లిదండ్రులు, తరువాత ఉపాధ్యాయులే” అని అన్నారు. ఉపాధ్యాయులకు ఏఐ శిక్షణ అందించడం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లాను ఉత్తీర్ణత శాతంలో ముందంజలో ఉంచడం లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి, డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story