ప్లాస్టిక్ వ్యర్థాలపై RRR సెంటర్లు.. క్యూర్‌లో స్వ‌చ్చ సర్వేక్షన్‌పై స‌మీక్ష‌

by Ramesh Naini |

అధికంగా చెత్త వేసే స్పాట్‌ల‌ను గుర్తించి అక్కడ చెత్త వేయ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పోరేష‌న్ క‌మిష‌నర్ విన‌య్ కృష్ణా రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

ప్లాస్టిక్ వ్యర్థాలపై RRR సెంటర్లు.. క్యూర్‌లో స్వ‌చ్చ సర్వేక్షన్‌పై స‌మీక్ష‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికంగా చెత్త వేసే స్పాట్‌ల‌ను గుర్తించి అక్కడ చెత్త వేయ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పోరేష‌న్ క‌మిష‌నర్ విన‌య్ కృష్ణా రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. స్వ‌చ్చ భార‌త్ మిష‌న్‌పై తార్నాక‌లోని ప్రధాన కార్యాల‌యంలో గురువారం రోజున స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ ఎంఎంసీ, జీహెచ్ఎంసీ, సీఎంసీ‌లో మున్సిప‌ల్ కార్యాక‌లాపాల‌తో పాటు వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. మున్సిపల్ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు, పరిశుభ్రత చర్యలు, డ్రైనేజ్ మరియు ఇతర సేవలపై సమగ్రంగా సమీక్ష నిర్వ‌హించారు. స్వ‌చ్చ సర్వేక్షన్ ప‌నుల‌పై అధికారుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ పై అవగాహన కోసం జీహెచ్ఎంసీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వివరించారు. శానిటేషన్ అంశంపై నోడ‌ల్ అధికారుల‌కు పూర్తి బాధ్యతను అప్పగించి 100శాతం ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాల‌ని కమిషనర్ వియన్ కృష్ణారెడ్డి అన్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వ‌హ‌ణ కోసం రెడ్యూస్, రియూజ్, రిసైకిల్ (ఆర్ఆర్ఆర్) సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. తడి, పొడి చెత్త‌ నిర్వహణలో ప్రత్యేక చర్యలు చొర‌వ‌ తీసుకొని చెత్త వేసే ప్రదేశాల‌ను గుర్తించి తొలగించాలని తెలిపారు. రెడ్ స్పాట్ (పాన్ గుట్కా ఉమ్మి వేసే ప్రాంతాలు), ఎల్లో స్పాట్ (బహిరంగ మూత్ర ప్రదేశాలు) గుర్తించి అలాంటి ప్రదేశాలు లేకుండా చేయాలని సూచించారు. నివాస మరియు వాణిజ్య ప్రాంతాల మ్యాపింగ్ ద్వారా శానిటేషన్ చర్యలు చేప‌ట్టాల‌న్నారు. బ‌ల్క్ వేస్ట్ జ‌న‌రేట‌ర్స్ పై క‌ట్టుదిట్ట‌మైన ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని సూచించారు. అలాగే ఎంఎంసీ ప‌రిధిలో ప‌బ్లిక్ టాయిలెట్ల సంఖ్య మ‌రింత పెంచాల‌ని తెలిపారు. భ‌వ‌న నిర్మాణ‌ వ్యర్థాల సేకరణలో లోపాలు గుర్తించి క‌లెక్ష‌న్ పాయింట్ల పెంపు అవసరమ‌న్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఆర్ఆర్ఆర్ కేంద్రాల ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

Next Story