రెవెన్యూ భూములు అటవీ భూములుగా మారనున్నాయి.. 427 ఎకరాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by Ramesh Naini |   (  Updated:2025-10-26 16:56:07  IST  )

ప్రాజెక్టుల నిర్మాణాల్లో ముంపునకు గురైన అటవీ భూములకు ప్రత్యామ్నయంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ భూములను కేటాయించింది.

రెవెన్యూ భూములు అటవీ భూములుగా మారనున్నాయి.. 427 ఎకరాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాజెక్టుల నిర్మాణాల్లో ముంపునకు గురైన (forest lands) అటవీ భూములకు ప్రత్యామ్నయంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ భూములను కేటాయించింది. అటవీ శాఖకు బదలాయించిన భూములను అటవీ శాఖ భూములుగా గుర్తిస్తూ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం, మొండికుంట వాగుపై నిర్మించిన మీడియం రిజర్వాయర్ నిర్మాణంలో అటవీ శాఖ భూములు ముంపునకు గురయ్యాయి. ఈ భూమికి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో చోటా ప్రభుత్వ (రెవెన్యూ) భూమిని కేటాయించింది. తాజాగా కేటాయించిన ఈ భూములను అటవీశాఖ భూములుగా నోటిఫై చేస్తూ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన అటవీ భూమికి బదులుగా 399.02 ఎకరాల భూమిని వేరు వేరు సర్వే నెంబర్లలో, వివిధ ప్రాంతాల్లో కేటాయించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామపరిధి సర్వే నెంబర్ 61 లో మొత్తం 124.23 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో నుంచి 84.27 ఎకరాల భూమిని అటవీ శాఖకు పరిహారం కింద కేటాయించారు.

హనుమకొండ జిల్లా భీమదేవరంపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామ పరిధిలో సర్వే నెంబరు 340/15/2లో 30.13 ఎకరాలు, సర్వే నెంబర్ 353/14/2 లో 185.17 ఎకరాలు, సర్వే నెంబర్ 355/1/2లో 98.25 ఎకరాలు రెవెన్యూ భూమిని కేటాయించారు. ఈ భూమికి అటవీ శాఖ హద్దులు గుర్తిస్తూ రెవెన్యూ భూమి నుంచి అటవీశాఖ భూమిగా నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ములుగు జిల్లాలో మొండివాగు కుంట పై నిర్మించిన ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోయిని అటవీశాఖ భూమికి బదులుగా ములుగు జిల్లా వాజేడు మండలం లక్ష్మీపురం గ్రామం సర్వే నెంబర్ 50/2 లో ఉన్న 28.20 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీశాఖకు బదలాయించారు. ఈ భూమి అటవీ భూమిగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ భూమి తాలుకు సంబంధించిన సమగ్ర వివరాలు పేర్కొంటూ, సరిహద్దులు ఏర్పాటు చేశారు. అక్షాంశాలు, రేఖాంశాలను గుర్తించారు. ఈ భూములకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని అటవీశాఖ సంబంధిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

Next Story