చంద్రబాబుకు రేవంత్ స్వీట్ వార్నింగ్

by Muthe.Rajitha |   (  Updated:2025-06-18 15:51:23  IST  )

ఏపీ ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు(Banakacharla Project)పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ప్రధాని మోడీ(PM Modi) ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కోరారు.

చంద్రబాబుకు రేవంత్ స్వీట్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు(Banakacharla Project)పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ప్రధాని మోడీ(PM Modi) ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కోరారు. ఈ ప్రాజెక్టు గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్(GWDT) 1980 అవార్డు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం(APRA) 2014ని ఉల్లంఘిస్తుందని, తెలంగాణకు గోదావరిలోని వాటా 968 టీఎంసీల నీటి వినియోగాన్ని అడ్డుకుంటుందని నేడు సచివాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ 200 టీఎంసీల నీటిని పోలవరం నుంచి రాయలసీమకు తరలించాలని చూస్తోందని, ఇది తెలంగాణలోని భద్రాచలం వంటి ప్రాంతాల్లో వరదల ప్రమాదాన్ని పెంచుతుందని, నీటి కేటాయింపులను కాలరాస్తుందని ఆయన వాదించారు. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తమ ప్రభావాన్ని ఉపయోగించి మోడీని ఒప్పించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్దామని అనకుంటుందేమో, తెలంగాణ మాత్రం తన హక్కులను ఎప్పటికీ వదులుకోబోదని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

గోదావరిలో 3,000 టీఎంసీ మిగులు జలాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వాదనను ఉటంకిస్తూ.. తెలంగాణ మొదట 968 టీఎంసీ నీటిని వినియోగించుకునేందుకు అనుమతించాలని, ఆ తర్వాత మిగిలిన నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చని సూచించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి.. ఈ ప్రాజెక్టు తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తుందని, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర నీటి కమిషన్ (CWC), గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (GRMB)లలో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో సమావేశమై ఈ ప్రాజెక్టు ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని, టెండర్లను ఆపాలని కోరనున్నారు.

Next Story