రేవంత్ పేరు చరిత్రలో నిలిచి పోతుంది : NCP నేత సుప్రియా సూలె

by Muthe.Rajitha |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ప్రశంసల వర్షం కురిపించారు పలు జాతీయ పార్టీల నాయకులు.

రేవంత్ పేరు చరిత్రలో నిలిచి పోతుంది : NCP నేత సుప్రియా సూలె
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ప్రశంసల వర్షం కురిపించారు పలు జాతీయ పార్టీల నాయకులు. నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై పార్లమెంటు చట్టబద్దత చేయాల్సిన అంశంపై రాష్ట్ర, జాతీయ కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ధర్నాలో ఎన్సీపీ(NCP) నేతలు, డీఎంకే(DMK) నేతలు పాల్గొని, మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్సీపీ నేత సుప్రియా సూలె మాట్లాడుతూ... రేవంత్ జీరో నుంచి మొదలు పెట్టి.. కార్యకర్త నుంచి సీఎం అయిన విధానం గొప్పదని కొనియాడారు.

గతంలో దేశంలోనే తొలిసారిగా 69% రిజర్వేషన్లను కరుణానిధి అమలు చేసారని అన్నారు. అంబేద్కర్, కరుణానిధి పేర్లు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించినట్టు రేవంత్ పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. పీడితుల, బడుగు బర్గాల తరపున రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం వృథాగా పోదని అన్నారు. పార్లమెంటులో మా మద్దతు తప్పకుండా ఉంటుందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా, డీఎంకే ఎంపీ కనిమొళిని ప్రకటించారు.

Next Story