Bathukamma Sarees: రేవంతన్న బతుకమ్మ కానుక.. ఇందిరా మహిళా శక్తి ద్వారా చీరలు పంపిణీ

by Ramesh Naini |   (  Updated:2025-09-10 03:55:58  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరల పంపిణీ నిర్ణయం తీసుకుంది.

Bathukamma Sarees: రేవంతన్న బతుకమ్మ కానుక.. ఇందిరా మహిళా శక్తి ద్వారా చీరలు పంపిణీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం బతుకమ్మ (Bathukamma) పండుగ కానుకగా మహిళలకు చీరల పంపిణీ నిర్ణయం తీసుకుంది. పండుగ పూట ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం నింపే ‘రేవంతన్న బతుకమ్మ కానుక’ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం @Congress4TS శుక్రవారం ఎక్స్ వేదిక వెల్లడించింది. ఇందిరా మహిళా శక్తి చీరలు.. గౌరవం, సంతోషం, స్వాభిమానానికి ప్రతీక అని పేర్కొంది. ప్రతి మహిళకు రెండు నాణ్యమైన చీరలు, ఒక్కొక్కటి రూ. 800 విలువ గలవి అని తెలిపింది. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరల పంపిణీ చేయనున్నారు. (Indira Mahila Shakti Scheme) ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఆడబిడ్డల బతుకమ్మ వేడుకలకు కొత్త వెలుగు. 6000 మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ చేనేత రంగాన్ని ప్రజా ప్రభుత్వం కాపాడుతోందని తెలిపింది. ఒకవైపు పండుగ ఆనందం, మరోవైపు చేనేతకు ఊపిరి, ఇదే కాంగ్రెస్ ప్రజా సర్కార్ ప్రత్యేకత అని ఎక్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ బతుకమ్మ చీరల ఫోటోలను పంచుకుంది.

Next Story