చెప్పులతో కొట్టుకునే దుస్థితి తెచ్చావు రేవంత్.. హరీశ్‌రావు సెటైరికల్ ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-09 11:16:11  IST  )

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో యూరియా (Urea) కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.

చెప్పులతో కొట్టుకునే దుస్థితి తెచ్చావు రేవంత్.. హరీశ్‌రావు సెటైరికల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో యూరియా (Urea) కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అటు వ్యవసాయ పనులు చేసుకోలేక.. పీఏసీఎస్‌ (PACS)ల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు యూరియా కొరతపై అధికార కాంగ్రెస్ (Congress).. విపక్ష బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యూరియా దిగుమతులలో జాప్యం, వినియోగం పెరుగుదల, సాగు విస్తరణ, బ్లాక్ మార్కెటింగ్, దేశీయ ఉత్పత్తిలో అంతరాయాలు వంటి కారణాల వల్ల ఏర్పడిన ఈ కొరత అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) యూరియా కోసం మహిళలు చెప్పులతో పరస్పర దాడికి దిగిన ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ‘సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో యూరియా కోసం వచ్చిన మహిళలు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకునే దుస్థితి తెచ్చావు రేవంత్ రెడ్డి. మహిళలను కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు.. కనీసం ఆడబిడ్డల ఆత్మగౌరవమైనా జర నిలబెట్టు.. అంటూ వీడియోను ట్యాగ్ చేస్తూ హరీశ్ రావు సెటైరికల్‌ ట్వీట్ చేశారు.

Read More: హరీశ్‌రావు మానసిక స్థితి బాగోలేదు.. ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్

Next Story