రేవంత్ నన్ను అరెస్ట్ చేసేంత ధైర్యం చేయడు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-21 10:21:08  IST  )

ఫార్ములా ఈ-రేసు కేసు (Formula E race case) వ్యవహారంలో అవినీతి జరగలేదనే విషయం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి కూడా తెలుసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ నన్ను అరెస్ట్ చేసేంత ధైర్యం చేయడు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు కేసు (Formula E race case) వ్యవహారంలో అవినీతి జరగలేదనే విషయం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి కూడా తెలుసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం అనంతరం సరదాగా చిట్‌చాట్ మాట్లాడుతూ.. ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తాను లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధమేనని ప్రకటించారు. ఇక కడియం శ్రీహరి (Kadiyam Srihari)ని కాపాడేందుకు.. దానం నాగేందర్‌ (Danam Nagender)తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని.. ఆ తర్వాతే ఉప ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. ఫార్ములా ఈ-రేసు కేసు వ్యవహారంలో రేవంత్ తనను అరెస్ట్ చేసేంత ధైర్యం చేయరని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read More... రివేంజ్ పాలిటిక్స్‌పై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Next Story